E-Paper
Advertisement

రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్
Advertisement

Korean fantasy horror thriller: ప్యాలెస్ అంటే ఎలా ఉంటుంది. కళ్ళు చెదిరే ఇంటీరియర్ తో పాటు అబ్బుర పరిచే విశేషాలు ఎన్నో ఉంటాయి. అలాంటి రాజభవనం బూత్ బంగ్లాలా మారితే ? ఓ శాపం అక్కడ ఉన్న వారిని వేటాడి, వెంటాడి చంపితే… వినడానికేదో హర్రర్ స్టోరీలా ఉంది కదా. కానీ ఇది హర్రర్ మూవీ మాత్రమే కాదు, ఫ్యాంటసీ థ్రిల్లర్ కూడా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సినిమా కాదు సిరీస్ గురించి. ఆ సిరీస్ పేరే ‘ది ఈస్ట్ ప్యాలెస్’ (The East Palace). మరి ఈ కొరియన్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? తెలుగులో అందుబాటులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ అంతా చారిత్రక రాజభవనం ‘ఈస్ట్ ప్యాలెస్’ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ క్రౌన్ ప్రిన్స్ ఉంటాడు. కానీ ఈ భవనంలో వరుసగా మిస్టీరియస్ మరణాలు సంభవిస్తుంటాయి. ముప్పై ఏళ్ల క్రితం జరిగిన దారుణ సంఘటనల తరహాలోనే ఇప్పుడు కూడా జరుగుతుండటంతో రాజు తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. అయితే అవేమీ సాధారణ మరణాలు కాదు. అది ప్రాచీన శాపం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలు. దెయ్యాలు అదృశ్య శక్తులు చేస్తున్న పని అని అతను గ్రహించడానికి ఎక్కువ టైమ్ ఏమీ పట్టదు.

Advertisement

ఈ అతీంద్రియ శక్తుల రహస్యాలను కనిపెట్టడానికి రాజు రెండు ప్రత్యేక శక్తులను సీక్రెట్ గా తెచ్చి పెడతాడు. అందులో ఒకరు గు-చియాన్. అతను మనుషుల ప్రపంచానికి, దెయ్యాల లోకానికి మధ్య ప్రయాణించగల అహంకారి, లెజెండరీ ఘోస్ట్ స్లేయర్. అంతేకాదు అతనికి దెయ్యంగా మారే మాయాశక్తి కూడా ఉంటుంది. తన కత్తితో వాటిని అంతం చేసే అపారమైన నైపుణ్యం ఉంటుంది. ఇక రెండవ వ్యక్తి సాయింగ్-గాంగ్. ఆమె చనిపోయిన ఆత్మల మాటలను, శబ్దాలను వినగలదు. వాటితో కమ్యూనికేట్ చేయగల అంతఃపుర దాసి. ఆమె బతికున్న వారి ప్రపంచానికి యాంకర్ లాగా పని చేస్తూ, గు-చియాన్‌ను ఒక తాడు ద్వారా కంట్రోల్ చేస్తూ, గైడ్ చేస్తుంది.

ఈ ఇద్దరూ కలిసి రాజభవనంలోని మిస్టరీలను బయట పెడతారు. గతంలో జరిగిన ఘోరమైన సంఘటనల నుంచి మొదలు పెడితే, రాజకుటుంబం చేసిన పాపాలు, శాపం వెనుక ఉన్న నిజమైన శత్రువు ఏంటి అనేది కూడా బయట పడుతుంది. మరి ఇంతకీ ఆ శాపానికి గల కారణం ఏంటి ? రాజకుటుంబీకులు చేసిన పాపం ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టిన ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

ఈ భయంకరమైన కొరియన్ పీరియడ్ హారర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు సహా అనేక భాషల్లో డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. మిలిటరీ సర్వీస్ తర్వాత నామ్ జూ-హ్యుక్ నటించిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్ ను హారర్ మూవీ ఫ్యాన్స్‌కి డోంట్ మిస్.

Read Also: అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే కిల్లర్… ఒళ్లు జలదరించే రియల్ స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×