E-Paper
Advertisement

OTT Movie : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?
Advertisement

OTT Movie : దెయ్యాలు పట్టడం అన్నది సినిమాలలో చూసే సర్వసాధారణ విషయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం ఒక యువ జంట జీవితంలో దుష్ట శక్తి చొరబడి, వారి వివాహా జీవితాన్ని నాశనం చేస్తూ భయంకరమైన సంఘటనలను సృష్టిస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

11 మిలియన్లకు పైగా వ్యూస్
ఈ సినిమా పేరు “ది డెవిల్స్ బ్రైడ్” (The Devil’s Bride). ఇందులో ఎరికా కార్లినా (ఎచా), ఎమిర్ మహిరా (ఏరియల్), రూత్ మరిని, వావి జిహాన్, ఎన్స్ బాగస్, ఆల్ఫీ ఆల్ఫాండి తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో లేదు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదొక ఇండోనేషియన్ సూపర్ నాచురల్ హారర్ చిత్రం. ఇందులో భయంకరమైన అంశాలతో పాటు సాంస్కృతిక అంశాలను (ముస్లిం ఎక్సార్సిజం) మిక్స్ చేశారు. ఈ చిత్రం జిన్ డాసిమ్ అనే దెయ్యం చుట్టూ తిరుగుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో, అతీంద్రియ శక్తుల సన్నివేశాలతో హారర్ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఇందులో ఉన్న డ్రామా అంశాలు, ముఖ్యంగా వివాహ సమస్యలు, కుటుంబ బంధాలు, కథకు భావోద్వేగ లోతును జోడిస్తాయి. Rjl 5 పాడ్‌కాస్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది టిక్‌టాక్‌లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.

Advertisement

Read Also : దెయ్యాన్ని వదిలించే వాళ్ళకే దెయ్యం పడితే… ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉన్న హర్రర్ మూవీ

కథలోకి వెళ్తే…
ఎచా (ఎరికా కార్లినా), ఏరియల్ (ఎమిర్ మహిరా) వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న ఒక జంట. ఎచా తన కలల్లో ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలుస్తుంది. అంతేకాదు అతనితో చేయకూడని పనులన్నీ చేస్తుంది. మరోవైపు భర్తకు ఆమె తీరుపై అనుమానం వస్తుంది. ఇక ఆమె అనుకోకుండా ప్రెగ్నెంట్ అని తెలియడంతో గొడవ పెద్దది అవుతుంది. హాస్పిటల్ కి వెళ్తే అసలు ఆమె ప్రెగ్నెంట్ కాదనే షాకింగ్ విషయం బయటపడుతుంది. అయితే కలలో కన్పించే ఆ అబ్బాయి జిన్ డాసిమ్ అనే దుష్ట ఆత్మ అని త్వరగానే తెలుసుకుంటుంది ఈ జంట. ఆమెను తన “దెయ్యం వధువు”గా చేసుకోవాలని కోరుకుంటాడు. అందుకే ఈ జిన్ హీరోయిన్ మ్యారేజ్ లైఫ్ ను నాశనం చేయడానికి చాలా పనులే చేస్తుంది. ఇంతకీ ఈ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఆ జంట ఏం చేసింది? ఆ దెయ్యం ఎందుకు ఈ అమ్మాయి వెంట పడింది? క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవలసిన అంశం.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×