// // Kannada OTT releases 2026 : జనవరిలో ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ -->
E-Paper
Advertisement

Kannada OTT releases 2026 : జనవరిలో ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kannada OTT releases 2026 : జనవరిలో ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Kannada OTT releases 2026 : కన్నడ సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్. 2025 డిసెంబర్‌ లో వచ్చిన ముగ్గురు బిగ్ స్టార్స్ మూవీస్ న్యూ ఇయర్‌ సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ తర్వాత చాలా రోజులు కన్నడ కంటెంట్ ఓటీటీలో పెద్దగా హైలైట్ కాలేదు. కానీ డిసెంబర్‌లో వచ్చిన మూడు బిగ్ రిలీజ్‌లు ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నాయి. రెండు మూవీస్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ లోనే ఓటీటీ డీల్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మూడో మూవీ డీల్ త్వరలోనే క్లోజ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కన్నడ ఆడియన్స్ కు ఈ మూడు మూవీస్‌తో 2026లో న్యూ ఇయర్ బిగ్ బ్యాంగ్ అవుతుంది.

45

అర్జున్ జన్య డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ ఇది. రియాలిటీ షో జడ్జి‌గా ఫేమస్ అయిన అర్జున్ జన్యకి జీ నెట్‌వర్క్‌ తో లాంగ్ అసోసియేషన్ ఉంది. కాబట్టి ఆయన నటించిన ఈ సినిమా సాటిలైట్, అండ్ డిజిటల్ రైట్స్ జీ నెట్‌వర్క్‌కి వెళ్లాయి. ఓటీటీ పార్టనర్ Zee5, టీవీ రైట్స్ జీ కన్నడ చేతికి చిక్కాయి. థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తరువాత అనే జనవరి 26 న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇంకా మేకర్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంది.

మార్క్ (Mark)

Advertisement

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా వచ్చే ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన నటించిన గత రెండు సినిమాలు విక్రాంత్ రోనా, మ్యాక్స్ డిజిటల్ రైట్స్ ను జీ నెట్‌వర్క్‌ తీసుకుంది. కాబట్టి ‘మార్క్’ కూడా అదే ఓటీటీలో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రిపోర్ట్స్ ప్రకారం JioHotstar ఈ మూవీ రైట్స్ తీసుకుంది. సుదీప్ బిగ్ బాస్ కన్నడకి 4 ఏళ్ల కాంట్రాక్ట్ సైన్ చేయడం వల్ల ఈ డీల్ జరిగినట్టు కనిపిస్తోంది. JioHotstar కన్నడ కంటెంట్‌లో అంత యాక్టివ్ కాదు. కానీ హిట్ కామెడీ ‘సు ఫ్రమ్ సో’ రైట్స్ ను తీసుకుంది. అలాగే ‘మార్క్’ కూడా రిలీజైన 4 వీక్స్ తరువాత అంటే జనవరి 26న లేదా అంతకు ముందే ఓటీటీ రిలీజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

ది డెవిల్ (The Devil)

చాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటించిన కన్నడ మూవీ ఇది. ఈ మూవీ OTT పార్టనర్ లేకుండానే థియేటర్స్‌లోకి వచ్చింది. మాసివ్ ఓపెనింగ్ తీసుకున్నా ఈ మూవీ కలెక్షన్లు తర్వాత స్లో డౌన్ అయింది. రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ జైల్లో ఉండటంతో సినిమా ఆయన లేకుండానే రిలీజ్ అయింది. సూన్ ఈ మూవీ డీల్ ఫైనల్ అవుతుందని ఎదురు చూస్తున్నారు దర్శన్ అభిమానులు.

Advertisement

Read Also : షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×