E-Paper
Advertisement

టైం ట్రావెల్ చేసి కిల్లర్ చేతిలో బుక్కయ్యే అమ్మాయి… కొరివితే తల గోక్కోవడం అంటే ఇదే మరి

టైం ట్రావెల్ చేసి కిల్లర్ చేతిలో బుక్కయ్యే అమ్మాయి… కొరివితే తల గోక్కోవడం అంటే ఇదే మరి
Advertisement

Korean thriller OTT : మీరు ఫుల్‌గా డీప్‌ స్లీప్‌ వేశారు. అప్పటికీ అర్థరాత్రి దాటింది. ఇంతలోనే ఫోన్ ఒక్కసారిగా మోగితే గుండె దడదడలాడుతుందా… లేదా? ఒక వేళ ఫోన్ లిఫ్ట్ చేశాక తెలియని వాయిస్ వినిపిస్తే ఏమనిపిస్తుంది ? అదే భయాన్ని, అదే ఉత్కంఠను మీ ముందుకు తీసుకొచ్చే సినిమానే ‘ది కాల్’ (The Call). ఈ సినిమాలో ప్రతి క్షణం కొత్త ట్విస్టులు కనిపిస్తాయి. ప్రతి సంభాషణలో దాగి ఉన్న ఒక చీకటి నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వినిపించే ప్రతి రింగ్ ఒక ప్రమాదానికి సంకేతంగా నిలుస్తుంది.

ఎక్కడ చూడచ్చంటే ?

2020లో విడుదలైన ఈ కొరియన్ సైకాలజికల్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. లీ చుంగ్ హ్యున్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పార్క్ షిన్ హ్యే, జియోన్ జాంగ్ సియో ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ క్యారెక్టర్లతో నిర్మించిన ఈ సినిమా, టైమ్ కనెక్షన్ అనే కాన్సెప్ట్‌ను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కలిపింది. ఇదే ప్రత్యేక అనుభూతిని కలిగించేలా చేస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిందనే చెప్పాలి. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరో మెయిన్ అసెట్.

స్టోరీ ఏంటంటే ?

Advertisement

కథలో సియో యోన్ అనే యువతి తన చిన్నప్పటి ఇంటికి తిరిగి వస్తుంది. అక్కడ ఒక పాత ల్యాండ్ లైన్ ఫోన్ కనిపిస్తుంది. ఒక రోజు ఆ ఫోన్ మోగుతుంది. అవతల మాట్లాడేది యంగ్ సుక్ అనే అమ్మాయి. మొదట ఇది రాంగ్‌ కాల్‌లా అనిపించినా, తర్వాత తెలిసేది షాకింగ్‌. అదేంటంటే వారు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ వేర్వేరు కాలాల్లో జీవిస్తున్నారు. సియో యోన్ ప్రస్తుత కాలంలో ఉంటే, యంగ్ సుక్ 20 ఏళ్ల క్రితం అదే ఇంట్లో జీవిస్తుంది.

Also Read : ఇంట్లోనే ఉండి రోబోల ద్వారా బయట ప్రపంచంలో బతికే వింత లోకం… నెవర్ బిఫోర్ సీన్స్

Advertisement

ఈ యూనిక్‌ కనెక్షన్ వల్ల ఇద్దరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ప్రారంభిస్తారు. గతంలో జరిగిన ఒక ప్రమాదం గురించి సియో యోన్ చెప్పడంతో, యంగ్ సుక్ తన భవిష్యత్తును మార్చుకుంటుంది. కానీ అదే మార్పు ప్రస్తుత కాలంలో సియో యోన్ జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. మొదట చిన్న మార్పులుగా కనిపించినవి క్రమంగా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయి.

ఇక్కడి నుంచే అసలు భయం మొదలవుతుంది. యంగ్ సుక్ అసలు స్వభావం బయటపడుతుంది. ఆమె ఒక సైకో కిల్లర్ అని తెలిసినప్పుడు సినిమా మరింత ఉత్కంఠగా మారుతుంది. కాలాన్ని తన చేతుల్లో పెట్టుకున్న ఆమె, తనకు అనుకూలంగా గతాన్ని మార్చుకుంటూ భయంకరమైన నేరాలు చేస్తుంది. సియో యోన్ ఈ మార్పులను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి ప్రయత్నం కొత్త ప్రమాదాన్ని తెస్తుంది. చివరికి ఈ టైమ్ గేమ్ ఒక ప్రాణాంతక పోరాటంగా మారుతుంది. గతాన్ని మార్చి వర్తమానాన్ని కాపాడుకోవాలా? లేదా ఒక రాంగ్‌ డిషిషన్‌తో అన్నీ కోల్పోవాలా అనే ప్రశ్నతో ఈ సినిమా నడుస్తోంది. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది? సియో యోన్ నెక్ట్స్‌ ఏం చేసిందో తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లోకి వెళ్లి చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×