// // తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు... -->
E-Paper
Advertisement

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
Advertisement

Family Drama : ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటిని చక్కదిద్దితే, మగవాళ్ళు సంపాదించడం. ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తున్నారు అనుకోండి. అది వేరే సంగతి. కానీ ‘జంబలకిడిపంబ’ వంటి తెలుగు సినిమాలలో చూపించినట్టు ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే… అలాంటి కథతో రూపొందిన మూవీనే ‘ది బ్రెడ్‌విన్నర్’ (The Breadwinner 2026). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కథలో హీరో పేరు నేట్ విల్కాక్స్. అతను సేల్స్‌మన్. అతని భార్య కేటీ ముగ్గురు ఆడపిల్లలను చూసుకుంటూ ఇల్లాలుగా ఉంటుంది. ఇంట్లోని పనులన్నీ కేటీనే చూసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడూ పద్ధతిగా సాగుతుంది. కానీ కేటీ సొంత ఆలోచనతో ఇంటికి సంబంధించి ఒక వస్తువును ఆవిష్కరిస్తుంది. ఆమె ఐడియా నచ్చి ప్రముఖ బిజినెస్ షో ‘షార్క్ ట్యాంక్’లో భారీ డీల్ దక్కుతుంది. దీనివల్ల కేటీ తన బిజినెస్ పని మీద నెల రోజుల పాటు బిజినెస్ ట్రిప్‌కు వెళ్లాల్సి వస్తుంది.

Advertisement

అప్పటి వరకు కేవలం సంపాదన మాత్రమే చూసుకున్న నేట్, ఇప్పుడు మొదటిసారిగా ఇంట్లో ఉండి ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తుంది. వాషింగ్ మెషీన్ ఎలా వాడాలో, గుడ్డు ఎలా ఉడకబెట్టాలో కూడా తెలియని నేట్ ఇల్లు మెయింటెన్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడతాడు. పిల్లలు కూడా తమ తండ్రి అమాయకత్వాన్ని చూసి ఆటపట్టిస్తుంటారు. ఒకానొక దశలో ఇల్లు మొత్తం చిందరవందరగా మారిపోతుంది. నేట్ ముగ్గురు కూతుళ్ల స్కూల్ టైమింగ్స్, వారి హోంవర్క్‌లు, రొటీన్ పనులను సరిగ్గా నిర్వహించలేక చేతులెత్తేస్తాడు.

కానీ క్రమంగా అతను తన కొత్త బాధ్యతలను అర్థం చేసుకుంటాడు. ఇల్లాలుగా ఇల్లు నడపడం ఆఫీస్ పని కంటే ఎంత కష్టమో నేట్ గ్రహిస్తాడు. చివరికి తన కూతుళ్ల సహాయంతో, అమ్మ పద్ధతిలో కాకపోయినా తనదైన ‘డాడ్ స్టైల్’లో ఇంటిని, పిల్లలను మేనేజ్ చేసి భార్యకు సర్‌ప్రైజ్ ఇస్తాడు. ఇవన్నీ భార్య చేతుల్లో ఉంటే సులభంగా అనిపిస్తాయి. కానీ ఆ బాధ్యతలు తండ్రి భుజాల మీద పడితే ఏం జరుగుతుంది ? అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

హాలీవుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘ది బ్రెడ్ విన్నర్’. విల్ ఫెర్రెల్ ఫేమ్ నేట్ బార్గట్జే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 29న థియేటర్లలో విడుదలైంది. కుటుంబ బాధ్యతలు, భర్త-భార్యల సమానత్వం, పిల్లల పెంపకం గురించి ఆలోచింపజేసే చిత్రం ఇది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, Google Play, YouTubeలలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Read Also: రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×