E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలో బ్యాన్ అయిన మూవీ… వీక్ హర్టెడ్ పీపుల్ చూడకూడని హర్రర్ స్టోరీ.. సర్ప్రైజింగ్ కాన్సెప్ట్

OTT Movie : ఓటీటీలో బ్యాన్ అయిన మూవీ… వీక్ హర్టెడ్ పీపుల్ చూడకూడని హర్రర్ స్టోరీ.. సర్ప్రైజింగ్ కాన్సెప్ట్
Advertisement

OTT Movie : హాలీవుడ్ సినిమాలు హారర్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ‘ఈవిల్ డెడ్’ లాంటి సినిమాలతో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హారర్‌కు భిన్నంగా, సైకలాజికల్ థ్రిల్లర్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్‌తో వచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ నేపథ్యంలో ఒక క్యాలెండర్ చుట్టూ తిరిగే భయంకరమైన కథను అందిస్తుంది. ఈ సినిమా ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే హార్ట్ వీక్ ఉంటే ఈ సినిమాను చూడకపోవడమే మంచిది. ఎందుకంటే గుండె దఢను పెంచే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి.  దీని పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

కథలోకి వెళ్తే

Advertisement

ఈవా ఒకప్పుడు డాన్సర్ గా ఉండేది. కానీ ఒక ప్రమాదం కారణంగా ఇప్పుడు వీల్‌చైర్‌లో జీవిస్తోంది. ఒక రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె స్నేహితురాలు సోఫీ, ఆమెకు ఒక పాత జర్మన్ అడ్వెంట్ క్యాలెండర్‌ను బహుమతిగా ఇస్తుంది. ఈ క్యాలెండర్ సాధారణమైనది కాదు. ప్రతిరోజూ అది ఉన్న గది తలుపు తెరిచినప్పుడు, చాక్లెట్ లాంటి బహుమతులు ఇస్తుంది. దానిని తింటే కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతాయి.

ఈ క్యాలెండర్‌తో పాటు కొన్ని నియమాలు ఉంటాయి: 1) ప్రతి రోజూ ఒక తలుపు తెరవాలి 2) ప్రతి బహుమతిని తినాలి లేదా ఉపయోగించాలి, 3) క్యాలెండర్‌ను ఎవరికీ ఇవ్వకూడదు లేదా పాడు చేయకూడదు. ఈవా మొదట ఈ బహుమతులను ఆటగా భావిస్తుంది. కానీ త్వరలోనే అవి ఆమె జీవితంలో భయంకరమైన సంఘటనలకు దారి తీస్తాయని తెలుస్తుంది. ఉదాహరణకు ఒక చాక్లెట్ తిన్న తర్వాత, ఆమెను బాధపెట్టిన వ్యక్తి దారుణంగా చనిపోతాడు. ఈవా తన చుట్టూ ఉన్నవారు—సోఫీ, ఆమె తండ్రి, ఇతర వ్యక్తులు దీనివల్ల ప్రమాదంలో పడటం చూస్తుంది.

Advertisement

క్యాలెండర్‌లో ఒక రహస్యమైన దెయ్యం లాంటి జీవి ఉందని తెలుస్తుంది. అది ఈవాకు ఒక ఆఫర్ కూడా ఇస్తుంది. ఆమె క్యాలెండర్ నియమాలను పాటిస్తే, ఆమె మళ్లీ నడవగలుగుతుంది. కానీ దానికి బదులుగా ఆమె చుట్టూ ఉన్నవారు చనిపోతారు. ఈవా ఇప్పుడు ఏం చేయాలనే ఒక డైలమాలోచిక్కుకుంటుంది. తన కలలను సాకారం చేసుకోవడం కోసం ఇతరుల జీవితాలను బలివ్వాలా లేక క్యాలెండర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించాలా? అను కుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఈవా తీసుకునే నిర్ణయం ఎలాంటిది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

షడ్డర్ (Shudder) లో స్ట్రీమింగ్

‘ది అడ్వెంట్ క్యాలెండర్’ (The Advent Calendar) పాట్రిక్ రిడ్‌మాంట్ దర్శకత్వంలో రూపొందిన ఫ్రెంచ్-బెల్జియన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. ఇందులో యూజీనీ డెరౌండ్, హోనోరిన్ మాగ్నియర్, క్లెమెంట్ ఒలివియరీ ప్రధాన పాత్రల్లో నటించారు. షడ్డర్ (Shudder) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమా 6.3/10 రేటింగ్ ని పొందింది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×