E-Paper
Advertisement

OTT Movie : పిల్లాడికి మాత్రమే కనిపించే ఆత్మలు… సైకాలజిస్ట్ కు పెద్ద పరీక్షే పాపం…

OTT Movie : పిల్లాడికి మాత్రమే కనిపించే ఆత్మలు… సైకాలజిస్ట్ కు పెద్ద పరీక్షే పాపం…
Advertisement

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ తో వచ్చే సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కొన్ని ఆత్మలు చిన్న పిల్లవాడికి మాత్రమే కనపడుతూ ఉంటాయి. ఇతన్ని ఒక సైకాలజిస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందా వివరాల్లోకి వెళితే…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో

Advertisement

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సిక్స్త్ సెన్స్‘ (The 6th Sense). ఈ మూవీకి M. నైట్ శ్యామలన్ వహించారు. ఇందులో బ్రూస్ విల్లీస్ చైల్డ్ సైకాలజిస్ట్‌గా నటించాడు. అతడు తన పేషంట్ చనిపోయిన వారిని చూడగలడని, మాట్లాడగలడని  తెలుసుకుంటాడు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు శ్యామలన్‌కి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఓస్‌మెంట్‌కి ఉత్తమ సహాయ నటుడు,  కొల్లెట్‌కి ఉత్తమ సహాయ నటితో సహా ఆరు అకాడమీ అవార్డులకు, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నామినేట్ చేయబడింది. ఈ మూవీ USలో సుమారు $293 మిలియన్లు, ఇతర మార్కెట్లలో $379 మిలియన్లు వసూలు చేసింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో ఒక మంచి సైకాలజీస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. ఇతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, తనకు ఆత్మలు కనపడుతున్నాయంటూ మాట్లాడుతాడు. ఈ క్రమంలోనే వెంటనే గన్ తీసుకొని, తనను తాను కాల్చుకుని చనిపోతాడు. ఒకప్పుడు అతనికి ఈ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటాడు. అయితే అతడు మనసులో ఊహించుకుంటున్నాడు అనుకొని, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం మానేస్తాడు. చివరికి అతడు తన ముందే కాల్చుకుని చనిపోవడంతో, అతని చావుకు కారణం నేనే అని బాధపడతాడు. అయితే 9 సంవత్సరాల తర్వాత, ఒక పిల్లవాడికి ఆత్మలు కనపడుతున్నాయని ఈ డాక్టర్ తెలుసుకుంటాడు. అయితే 9 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి ఉన్న సమస్య, ఈ పిల్లవాడికి ఉన్న సమస్య ఒకటిగానే ఉంటుంది. ఆ డాక్టర్ అతనిని అబ్జర్వ్ చేస్తూ ఫ్యామిలీని కూడా మిస్ అవుతూ ఉంటాడు.

చివరికి ఈ డాక్టర్ తన భార్యను కూడా పట్టించుకోకపోవడంతో, ఆమె వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకునే అంతవరకు వెళ్ళిపోతుంది. హీరో ఆ పిల్లవాడికి ట్రీట్మెంట్ చేయనని చెప్పేస్తాడు. అయితే ఆ పిల్లవాడు డాక్టర్ తో, నువ్వు తప్పించి నా సమస్యను ఎవరు పరిష్కరించలేరని చెప్పడంతో మళ్లీ మనసు మార్చుకుంటాడు. చివరికి ఆ పిల్లవాడి సమస్యను హీరో తీరుస్తాడా? అతనికి నిజంగానే ఆత్మలు కనపడతాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) లో స్ట్రీమింగ్  అవుతున్న ‘ది సిక్స్త్ సెన్స్’ (The 6th sense) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×