E-Paper
Advertisement

Thadayam OTT release date: సముద్రఖని మర్డర్ మిస్టరీ సిరీస్‌ ఓటీటీ రిలీజ్ డేట్… ఏ ఓటీటీలో రానుందంటే ?

Thadayam OTT release date: సముద్రఖని మర్డర్ మిస్టరీ సిరీస్‌ ఓటీటీ రిలీజ్ డేట్… ఏ ఓటీటీలో రానుందంటే ?
Advertisement

Thadayam OTT release date : తమిళ ఇండస్ట్రీ నుంచి మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. నటుడిగా, దర్శకుడిగా రానిస్తున్న సముద్రఖని నటించిన ఈ వెబ్ సిరీస్ ‘తడయం’ ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. సముద్రఖని నటన ఈ సిరీస్ కి హైలెట్ గా నిలవనుంది. తమిళనాడు సరిహద్దుల్లో అర్ధరాత్రి వేళల్లో జరిగే వరుస హత్యలు చుట్టూ ఈ కథ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సముద్రఖని, కిల్లర్ వేటలో పడతాడు. ఉత్కంఠంగా సాగే ఈ సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్‌ ‘తడయం’ (Thadayam) వెబ్ సిరీస్ జీ5 (ZEE5) ఓటీటీలో 2026 ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సముద్రఖని పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సంవత్సరం రేగై, హార్టిలీ బ్యాటరీ, వేడువన్ వంటి సిరీస్‌లను నిర్మించిన ZEE5 ఈ సంవత్సరం ‘తడయం’ పేరుతో ఆడియన్స్ ను అలరించబోతోంది. ఈ సిరీస్ ను ఫిబ్రవరి 27 నుంచి OTTplay ప్రీమియం సబ్‌స్క్రైబర్లు కూడా చూడవచ్చు. ZEE5 సాధారణంగా ఒరిజినల్ సిరీస్‌లను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంది. ఈ సిరీస్ కూడా అదే రోజున తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అజయ్ కృష్ణ నిర్మించిన ఈ సిరీస్ ని ZEE5 లో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1999వ సంవత్సరంలో ఒక సీరియల్ కిల్లర్, అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న మహిళలను అత్యంత క్రూరంగా హత్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ హంతకుడు కేవలం హత్యలు చేయడమే కాకుండా, మరణించిన మహిళల మెడలోని తాళిని మాత్రమే దొంగిలించి తీసుకువెళ్తుంటాడు. ఆ పట్టణంలో ఈ వింతైన, భయంకరమైన హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తాయి. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ (సముద్రఖని) తీసుకుంటాడు. హంతకుడు వదిలివెళ్ళే చిన్న చిన్న ఆధారాలను పట్టుకుని అతడిని పట్టుకున్నాడనేది ఈ సిరీస్ మిగతా కథ.

Read Also : ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×