E-Paper
Advertisement

Tere Ishk Mein out on OTT : ధనుష్, కృతి సనన్ల ఇంటెన్స్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ షురూ

Tere Ishk Mein out on OTT : ధనుష్, కృతి సనన్ల ఇంటెన్స్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ షురూ
Advertisement

Tere Ishk Mein out on OTT : ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ‘తేరే ఇష్క్ మే’ థియేటర్లలో విడుదలైనప్పటి నుండి అభిమానులలో మంచి బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రం 2025నవంబర్ 28న థియేటర్లలోకి అడుగుపెట్టింది. మంచి కలెక్షన్లను కూడా రాబట్టగలిగింది. దాదాపు రూ.65 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 161 కోట్లు వసూలు చేసింది. ఇక థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టింది. థియేటర్లలో మిస్ అయిన ధనుష్ అభిమానులు ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని చూసి ఆనందించే సమయం వచ్చేసింది. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో నవంబర్ 28న విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein) థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ధనుష్, కృతి సనన్‌ తెరపై రొమాన్స్ చేశారు. సుశీల్ ధహియా, ప్రకాష్ రాజ్, జయ భట్టాచార్య, మహమ్మద్ జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఉత్తర భారత్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ సినిమా ఎమోషన్స్ తో నడిచే ప్రేమకథగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. జనవరి 23 నుంచి ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగు వంటి భాషలలో చూడటానికి అందుబాటులో ఉంది. ‘రాంజనా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్, ధనుష్ కలిసి చేస్తున్న మూడవ చిత్రం ఇది. వీరిద్దరూ గతంలో ‘అత్రంగి రే’ లో కూడా పనిచేశారు.

కథ ఏమిటి ?

Advertisement

శంకర్ (ధనుష్) దూకుడు స్వభావం గల యువకుడు. అతను కాలేజీ రోజుల్లో ముక్తి (కృతి సనన్) అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడతాడు. అయితే శంకర్ ప్రేమను ముక్తి నిరాకరించడంతో అతనిలో ఆమెపై కోపం, ద్వేషం పెరుగుతాయి. ఇది వారిద్దరి మధ్య తీవ్రమైన గొడవలకు దారితీస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, శంకర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్‌గా మారుతాడు. ముక్తి పెళ్లయి గర్భవతిగా ఉన్న సమయంలో, లడఖ్‌లో ఉన్న శంకర్ మానసిక పరిస్థితిని పరీక్షించడానికి ఆమెను పిలిపిస్తారు. ఆ సమయంలో పాత జ్ఞాపకాలు, ఎదురైన ఇబ్బందులు కథను మలుపు తిప్పుతాయి. క్లైమాక్స్ మరింత షాకింగ్ ఇస్తుంది.

Read Also :  6 ఆస్కార్ నామినేషన్లు… IMDB రేటింగ్ 8.2… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×