E-Paper
Advertisement

OTT Movie : థియేటర్లలో ధనుష్ కొత్త సినిమా… పాష్ పిల్లకు ఫైటర్‌తో లింకు… ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?

OTT Movie : థియేటర్లలో ధనుష్ కొత్త సినిమా… పాష్ పిల్లకు ఫైటర్‌తో లింకు… ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ?
Advertisement

OTT Movie : గత కొంత కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘తేరే ఇష్క్ మే’. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో నవంబర్ 28న విడుదలై, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా ఓ ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ స్క్రీన్ రన్ తరువాత ఓటీటీ సమయం, కనీసం ఎనిమిది వారాలు ఉండటంతో మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. అయితే ఒక్కో సారి సినిమా ప్రదర్శనను బట్టి సమయం మారే అవకాశం ఉంటుంది. దీంతో డిసెంబర్ చివరి వారంలోనే ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలోకి రాబోతోందంటే

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్, కృతి సనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా, థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో సుశీల్ దహియా, మాహిర్ మొహియుద్దీన్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, హిమాన్షు శర్మ నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement

Read Also : మొదటి రాత్రే ఫుల్ బాటిల్ లేపే భార్య… గుటకలు మింగే భర్త… ఈ పంజాబీ సినిమాతో భలే కిక్కు మావా

స్టోరీ ఏమిటంటే

శంకర్ (ధనుష్) బెనారస్‌లో సాధారణ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. చదువుకుంటూ కూడా చిల్లరగా తిరుగుతుంటాడు. ఒక రోజు ముక్తి (కృతి సనోన్)ని చూస్తాడు. ముక్తి చాలా అందమైన అమ్మాయి, శంకర్ ముక్తి మీద పూర్తిగా ప్రేమలో పడిపోతాడు. మొదట ముక్తి అతన్ని పట్టించుకోదు. కానీ శంకర్ మాత్రం ఏమీ ఆశించకుండా ఆమె కోసం అన్నీ చేస్తాడు. ఆమెకు ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రాణం పెట్టి ప్రయత్నిస్తాడు. అలా ముక్తికి కూడా శంకర్ మీద ప్రేమ వస్తుంది. కానీ వాళ్ల ప్రేమకి ఫ్యామిలీ వల్ల చాలా అడ్డంకులు వస్తాయి. మధ్యలో శంకర్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. అల్లరిగా తిరిగే శంకర్ డిఫెన్స్ లో చేరడానికి కారణం ఏమిటి ? ముక్తితో ప్రేమ బంధం ఏమవుతుంది ? ఈ స్టోరీ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×