E-Paper
Advertisement

ఉన్నట్టుండి డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఊడిపడితే… లాస్ట్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు

ఉన్నట్టుండి డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఊడిపడితే… లాస్ట్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Tamil Crime Comedy: ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇక అప్పుల గోల ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి టైమ్ లో అందరికీ మనసులో అనిపించే మాట ఒక్కటే… డబ్బులు ప్రింట్ చేసే మిషన్ మన చేతిలో ఉంటే ఎంత బాగుండో. కానీ నిజంగానే అలాంటి మిషన్ సామాన్యుల చేతికి చిక్కితే ఎదురయ్యే పరిస్థితులు ఏంటి ? అనేది తెలియాలంటే ఈ ‘కాన్ సిటీ’ (Con City) మూవీని చూడాల్సిందే. 2026లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ కామెడీ చిత్రం ఏ ఓటీటీలో ఉంది ? తెలుగులో చూడొచ్చా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథ అంతా అప్పుల భారంతో సతమతమయ్యే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ‘లక్కీ భాస్కర్’ మూవీని గుర్తు చేస్తుంది. కాకపోతే ఇది ఇంకాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్తే… శరవణన్ (అర్జున్ దాస్) విద్యుత్ బోర్డు ఉద్యోగి. కుటుంబ ఆర్థిక సమస్యలు, బ్యాంకు లోన్లు, వడ్డీ వ్యాపారుల హెచ్చరికలతో భారంగా ఉంటుంది. రోజురోజుకూ ఇంట్లో గొడవలు, ఒత్తిడి పెరుగుతూనే ఉంటాయి. ఈ కష్టాల నుండి బయటపడాలని ఆ కుటుంబం చిన్న చిన్న మోసాలు, కుతంత్రాలు చేయడం మొదలు పెడుతుంది.

Advertisement

ఒకరోజు ఒక అనుకోని ఘటన జరుగుతుంది. శరవణన్ ఆఫీసులోని పాత రశీదుల ప్రింటర్ వింతగా ప్రవర్తిస్తుంది. హఠాత్తుగా రూ.500 కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడం ప్రారంభిస్తుంది. మొదట్లో భయపడిన ఆ కుటుంబం, క్రమంగా ఈ “ఉచిత డబ్బు”కు అలవాటు పడి, లగ్జరీ జీవితం మొదలు పెడుతుంది. కొత్త కారు, కొత్త ఇల్లు, ఖరీదైన బట్టలు… అన్నీ సులభంగా వచ్చేస్తుంది. కానీ ఈ రహస్యం బయటపడడంతో నగరంలో పెద్ద గందరగోళం మొదలవుతుంది.

స్థానిక ముఠాలు, పోలీసులు, మోసగాళ్లు ఈ ప్రింటర్ గురించి తెలుసుకుని, ఆ కుటుంబాన్ని వెంటాడటం స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ ఫ్యామిలీకి చెందిన చిన్న బాలుడు జీవాను విలన్లు కిడ్నాప్ చేస్తారు. ఇక్కడి నుండి కథ పూర్తి వేగం పుంజుకుంటుంది. బాలుడిని రక్షించుకోవాలంటే ఈ కుటుంబం మళ్లీ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. టోల్ బూత్ స్కామ్‌లు, ఫేక్ న్యూస్, స్మార్ట్ మోసాలు… ఇలా ఒక్కటేమిటి తమ చాకచక్యాన్ని ఉపయోగించి అన్నీ చేస్తారు. మరి ఆ ఫ్యామిలీ ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కింది ? చివరికి ఆ పిల్లాడిని ఎలా కాపాడుకున్నారు ? ఆ ప్రింటింగ్ మిషన్ వల్ల కలిగిన నష్టం ఏంటి ? అప్పుల ఊబిలో నుంచి బయట పడ్డారా లేదా ? అన్నది స్టోరీ.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

‘కాన్ సిటీ’ (Con City) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కోసం కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో యోగి బాబు, వడివుక్కరాసి కీలక పాత్రలు పోషించారు.

Read Also: చదువు చెప్పిన టీచర్ పై క్రష్… పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×