E-Paper
Advertisement

OTT Movie : ఫోన్ మార్చుకునే భార్యాభర్తల గేమ్… భార్యకు ఊహించని షాక్… ఇదెక్కడి తేడా యవ్వారం మావా ?

OTT Movie : ఫోన్ మార్చుకునే భార్యాభర్తల గేమ్… భార్యకు ఊహించని షాక్… ఇదెక్కడి తేడా యవ్వారం మావా ?
Advertisement

OTT Movie : కామెడీ-డ్రామా జానర్‌లో వచ్చే సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి కూర్చుని చూసే విధంగా ఉండే ఇలాంటి సినిమాలకు ఓటీటీలలో మంచి ఆదరణ ఉంటుంది. ఈరోజు 2025లో రిలీజ్ అయిన ఒక ఫన్, థాట్-ప్రొవోకింగ్ తమిళ మూవీ గురించి తెలుసుకోబోతున్నాము. అందులోనూ ఈ మూవీలో భార్యాభర్తల ఫోన్ గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతకీ ఈ మూవీ పేరేంటి? కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ 

ఈ తమిళ కామెడీ-డ్రామా పేరు ‘Ring Ring’. శక్తివెల్ దర్శకత్వంలో, జెగన్ నారాయణన్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని డియా సిన్ క్రియేషన్స్, రూల్ బ్రేకర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ మూవీ 2025 జనవరి 31న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సింప్లీ సౌత్ (Simply South) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇందులో వివేక్ ప్రసన్న, సాక్షి అగర్వాల్, డానియల్ ఎన్నీ పోప్, ప్రవీన్ రాజ్, అర్జునన్, సిద్ధా, సహానా, జమునా తదితరులు నటించారు. IMDbలో 7.5 రేటింగ్ ఉన్న ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ నలుగురు కపుల్స్ మధ్య జరుగుతుంది. వీళ్ళు చైల్డ్‌ హుడ్ ఫ్రెండ్స్‌గా ఒక బర్త్‌ డే పార్టీకి హాజరు అవుతారు. ఒక కపుల్ సజెస్ట్ చేసిన గేమ్‌తో పీకల మీదకు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరూ ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి… కాల్స్, మెసేజెస్‌ను షేర్ చేయాలి అన్నది గేమ్. ఇంకేముంది గేమ్ సరదాగా మొదలవుతుంది. కానీ గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ… రిలేషన్‌షిప్ సీక్రెట్స్, హిడెన్ అఫైర్స్, ఎమోషనల్ టెన్షన్స్ బయట పడతాయి. అప్పుడు కథ అసలు మలుపు తిరుగుతుంది. సీక్రెట్స్ బయట పడటం వల్ల జరిగే మిస్‌అండర్‌స్టాండింగ్స్ తో నిండి ఉంటుంది. క్లైమాక్స్ లో గేమ్ కాన్సెక్వెన్సెస్‌తో ముగుస్తుంది. నిజానికి ఈ ఫోన్ మార్చుకునే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ భార్యాభర్తల ఫోన్లు మార్చడం అనేది డేరింగ్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ క్లైమాక్స్ ఏంటి? గేమ్ ఎలా ముగిసింది ? దాని వల్ల ఎదురైన పరిణామాలు ఏంటి ? వారికి దంపతుల రియాక్షన్ ఏంటి ? అసలు ఇలాంటి గేమ్ ఎందుకు ఆడారు? అనేది తెలియాలంటే ఈ మూవీని తెరపై చూడాల్సిందే.

Read Also : ఇదెక్కడి పిచ్చి ప్రేమ సామీ… బతికుండగానే భార్యను బలిచ్చి దెయ్యంతో డీల్… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్స్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×