E-Paper
Advertisement

Suspense Thriller OTT : మిస్సింగ్ కేసుతో మొదలయ్యే మర్డర్ కేసు… 2 గంటల పాటు సీట్ ఎడ్జ్ లో ఉంచే కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Suspense Thriller OTT : మిస్సింగ్ కేసుతో మొదలయ్యే మర్డర్ కేసు… 2 గంటల పాటు సీట్ ఎడ్జ్ లో ఉంచే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Suspense Thriller OTT : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసేటప్పుడు ప్రేక్షకుల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంటుంది. ఇక ఈ కథలలో చివరి నిమిషం వరకు అసలు మిస్టరీని రివీల్ చెయ్యకుండా, ఉత్కంఠంగా నడిపిస్తుంటారు దర్శకులు. అలాంటి సినిమా ఒకటి, ఆశ్చర్యపరిచే మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలామంది ఈ సినిమాను ‘దృశ్యం’ వంటి సినిమాతో పోల్చారు కూడా. ఈ కన్నడ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది కూడా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ

కన్నడలో రూపొందిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘తత్సమ తద్భవ’ (Tatsama Tadbhava). 2023లో వచ్చిన ఈ సినిమా, విడుదలైన వెంటనే మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఆ సంవత్సరంలో కన్నడ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. IMDbలో ఈ చిత్రానికి 7.5 అద్భుతమైన రేటింగ్ ఉండటమే దీని విజయాన్ని అంచనా వేయవచ్చు. మేఘనా రాజ్, ప్రజ్జ్వల్ దేవరాజ్ నటించిన ఈ చిత్రం సుమారు 2 గంటల 2 నిమిషాల నిడివి కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కన్నడ సినిమా అయినప్పటికీ,  తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

కథ మొదలవ్వడమే ఒక పెద్ద షాకింగ్‌ సీన్‌తో మొదలవుతుంది. అరిక (మేఘనా రాజ్) అనే మహిళ కంగారు పడిపోతూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, తన భర్త సంజయ్ కనిపించడం లేదని కంప్లయింట్ ఇస్తుంది. అసలే పెళ్లి రోజు ఫంక్షన్ జరుగుతుండగా భర్త మాయం కావడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటారు. ఈ కేసును డీల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరవింద్ (ప్రజ్వల్ దేవరాజ్) సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆయన అడిగే ప్రశ్నలకు, అరిక ఇచ్చే సమాధానాలకు ఎక్కడా పొంతన ఉండదు. దాంతో ఈమె ఏదో దాస్తుందని అరవింద్‌కి డౌట్ కొడుతుంది.

తీరా చూస్తే, అదృశ్యమయ్యాడు అనుకున్న మొగుడు శవం వాళ్ళ ఇంట్లోనే కుళ్ళిపోయి కనిపిస్తుంది. దీంతో పోలీసులు అరికనే మెయిన్ విలన్ అని ఫిక్స్ అయిపోయి ఎంక్వైరీ మొదలుపెడతారు. కానీ ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చి, ఈమె పేరు అరిక కాదు అకిరా అని, ఆమె తన లవర్ అని కొత్త మలుపు తిప్పుతాడు. దీంతో అసలు ఆమె ఎవరో, ఎందుకు అబద్ధాలు ఆడుతుందో ఎవరికీ అర్థం కాదు. అసలు ఆ మొగుడిని చంపింది ఈమెనా? లేక ఈమె ముసుగులో ఇంకెవరైనా ఉన్నారా? అరవింద్ ఈ కేసులో బయటకు తెచ్చే నిజాలు ఏమిటి ? అనే విషయాలతో క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా సాగుతుంది.

Advertisement

Read Also :  అగచాట్లు పెట్టే పిల్ల పిశాచి… గుండె దడ పెంచే సీన్లు… వణికించే సౌండ్లు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×