E-Paper
Advertisement

Suspense Thriller OTT : కన్న తండ్రినే చంపాలనుకునే కొడుకు… ఊహించని ట్విస్టులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Suspense Thriller OTT : కన్న తండ్రినే చంపాలనుకునే కొడుకు… ఊహించని ట్విస్టులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్
Advertisement

Suspense Thriller OTT : మలయాళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు చూశాం కదా అనుకుంటున్నారేమో. కానీ వెతికి వెలికి తీయాలేగానీ, మీరు చూడని ఆణిముత్యాలు ఎన్నో. అలాంటి ఓ అద్భుతమైన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మైండ్ ను మడతబెట్టే ట్విస్టులతో సాగే ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

సైకలాజికల్ థ్రిల్లర్స్, అందులోనూ మలయాళం సినిమాలను ఇష్టపడే వాళ్లకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక జెమ్ లాంటిది. ఈ మూవీ పేరు ‘పుజు’ (Puzhu). 2022లో రతీనా పీటీ డెబ్యూ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఈ మూవీలో మమ్మూట్టి, పార్వతి తిరువోతు హీరోహీరోయిన్లుగా నటించారు. 2 గంటల 1 నిమిషం రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2022 మే 13న సోనీ లివ్‌ (Sony Liv)లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకోవడమే కాదు, హీరో మమ్మూట్టిని ఈ మూవీకి గానూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరించింది. ఈ డార్క్ థ్రిల్లర్ ను వే ఆర్ ది సైలెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ రాజన్, సి.వి. సారథి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మమ్మూట్టి, పార్వతి తిరువోతుతో పాటు అప్పుని శశి, వాసుదేవ్ సజీష్ మారార్, మాలప్పురం కోయా, ఇంద్రన్స్ తదితరులు నటించారు.

Advertisement

Read Also :  రొమాన్స్ నుంచి క్రైమ్ -కామెడీ వరకు… జనవరిలో రిలీజ్ కాబోతున్న కొరియన్ సినిమాలు, సిరీస్ లు ఇవే…

స్టోరీలోకి వెళ్తే…

ఈ సినిమా కథ అంతా కుట్టన్ (మమ్మూట్టి) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతనొక మాజీ పోలీస్ ఆఫీసర్. భార్య చనిపోతుంది. ఆ తర్వాత కొడుకు కిచుతో అందరికీ దూరంగా నివశిస్తాడు. అయితే కుట్టన్ సిస్టర్ భారతి (పార్వతి తిరువోతు) కేపీ అనే ఒక లోయర్ కాస్ట్ కి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. దీంతో భారతిని కుట్టన్ ఫ్యామిలీ దూరం పెడుతుంది. కానీ తరువాత అనుకోకుండా తన భర్తతో కలిసి కుట్టన్ ఉంటున్న ఫ్లాట్ లోకి రెంట్ కి దిగుతారు. ఇక ఆ తరువాత కుట్టన్ ఫ్యామిలీ ని కంట్రోల్ చేయడానికి తెగ ప్రయత్నిస్తాడు. కొడుకుతో డిసిప్లిన్ పేరుతో కఠినంగా వ్యవహరిస్తాడు. అది తనకు నచ్చకపోయినా, భయంతో సైలెంట్ గా ఉండిపోతాడు కిచు. ఈ నేపథ్యంలోనే కుట్టన్ ను చంపడానికి ఎవరో ట్రై చేస్తూ ఉంటారు. మరి ఇంతకీ కుట్టన్ ను చంపాలి అనుకున్నది ఎవరు ? సిస్టర్ ను అతను చేరదీశాడా లేదా ? చివరికి ఏమైంది ? కన్న కొడుకునే తన తండ్రి చనిపోవాలని ఎందుకు అనుకుంటాడు ? కుట్టన్ కు ఉన్న జబ్బు ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×