E-Paper
Advertisement

Suspense Thriller OTT : ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో దూరే పోలీస్ – నిందితుడు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Suspense Thriller OTT : ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో దూరే పోలీస్ – నిందితుడు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Suspense Thriller OTT : కులం, మతం అనే ఈ వివాదాలు మనుషుల్ని ఎంతగా కబలిస్తాయో అందరికీ తెలుసు. ఇలాంటి స్టోరీలతో రూపొందే సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ వివాదాలు వెంటాడే ఈ జానర్ సినిమాలను తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు అంత తేలికగా ధైర్యం చేయరు. అలాగే హీరోలు కూడా పెద్దగా ఆసక్తిని చూపించరు. కానీ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం అలాంటి ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ లో నటించారు. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2021లో వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుతి’ (Kuruthi). డైరెక్టర్ మను వారియర్ డెబ్యూ ఫిల్మ్ ఇది. అనీష్ పల్ల్యాల్ స్క్రిప్ట్ రాయగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుప్రియ మీనన్ నిర్మించారు. మతం, ద్వేషం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరిగే ఇంటెన్స్ సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ ఈ మూవీ. 2 గంటల 2 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2021 ఆగస్ట్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళీల ప్రత్యేకమైన పండగ ఓనం కానుకగా వచ్చింది. మలయాళ సినిమాలో మంచి థ్రిల్లర్‌ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ మూవీ క్రిటిక్స్ ను సైతం మెప్పించింది.

Advertisement

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్ హైదర్ పాత్రలో నటించారు. మర్డర్ సస్పెక్ట్ ఇబ్రహిం పాత్రలో రోషన్ మాథ్యూ, సపోర్టింగ్‌ రోల్స్ మురళి గోపి, షైన్ టామ్ చాకో, మమ్ముకోయ, శ్రిందా, నాస్లెన్, మణికంఠన్ ఆచారి తదితరులు నటించారు. ఒకే రాత్రి జరిగే ఈవెంట్స్, మర్డర్ సస్పెక్ట్ వేటను ఇంట్రెస్టింగ్ గా చూపించారు ఈ మూవీలో. మత ద్వేషం, మానవత్వం గురించి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని చూశాక థ్రిల్లర్ ఫ్యాన్స్‌ తప్పకుండా వర్త్ వాచింగ్ మావా అంటారు.

Read Also :  మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కేరళలోని ఒక మలయాళ ముస్లిం ఫ్యామిలీ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మాజీ పోలీస్ ఆఫీసర్ హైదర్ (పృథ్వీరాజ్) మన హీరో. భార్య చనిపోయిన బాధ్యలో ఉంటాడు. అతని కొడుకు, తండ్రి సుమన్ (మమ్ముకోయ)తో కలిసి ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంటాడు. ఒకరోజు రాత్రి సడన్ గా ఇబ్రహిం (రోషన్ మాథ్యూ) అనే యువకుడు వచ్చి హైదర్ ఇంట్లో దాక్కుంటాడు. అతను ఒక హిందూ యాక్టివిస్ట్‌ మర్డర్ కేసులో నిందితుడు.

ఇక విషయం తెలిసిన ఎస్ఐ సురేష్ (మురళి గోపి)టీమ్ నిందితుడిని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతుంది. మరోవైపు హిందూ గ్రూప్ లీడర్ లాజరస్ (షైన్ టామ్ చాకో) ఇబ్రహింని పట్టుకోవడానికి హైదర్ ఇంటిని ముట్టడిస్తారు. ఇక అప్పటికే భార్య మృతితో బాధపడుతున్న హీరోకి కొత్త టెన్షన్ పట్టుకుంటుంది. ఇబ్రహింని ప్రొటెక్ట్ చేయాలా ? లేదా పోలీసులకు పట్టించాలా ? అనే డైలమాలో పడతాడు. మరి ఇంతకీ హైదర్ తీసుకున్న నిర్ణయం ఏంటి ? దానివల్ల ఏం జరిగింది ? నిజంగానే నిందితుడు మర్డర్ చేశాడా ? అన్నది స్టోరీ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×