E-Paper
Advertisement

15 ఏళ్ల కిందటి వరుస హత్యల కేసు… 8.5 రేటింగ్ తో అదరగొడుతున్న థ్రిల్లర్ సిరీస్

15 ఏళ్ల కిందటి వరుస హత్యల కేసు… 8.5 రేటింగ్ తో అదరగొడుతున్న థ్రిల్లర్ సిరీస్
Advertisement

Suspense Thriller OTT : ఒళ్ళు గగుర్పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ సిరీస్ మీకోసమే. ఇది ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఎక్కడ లేని క్యూరియాసిటీ పుట్టిస్తూ, క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెట్టే రకం. ఇది కేవలం క్రైమ్, ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాకుండా.. ఒక మనిషి తన గతాన్ని దాచుకుని ఫ్యామిలీతో ఎలా బతుకుతున్నాడు, అది తెలిసినప్పుడు వాళ్ళ బంధం ఏమైందనే ఎమోషనల్ యాంగిల్ కూడా ఇందులో చాలా బలంగా ఉంటుంది. చివరికి అసలు విలన్ ఎవరో తెలిసే వరకు మనల్ని ఊహల లోకంలో తిప్పుతూ ఉంటారు. అందుకే ఇది క్రైమ్ ఇష్టపడే వాళ్ళకే కాకుండా, ఫ్యామిలీ డ్రామాలు చూసే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. దీనికి ఐయండిబిలో 8.5 రేటింగ్ ఉందంటే సిరీస్ ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఫ్లవర్ ఆఫ్ ఈవిల్’ (Flower of Evil). 2020లో వచ్చిన ఈ సూపర్ హిట్ సిరీస్ కి కిమ్ చొ క్యూ దర్శకత్వం వహించగా, ఇందులో లీ జూన్-గి, మూన్ చే-వోన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ 2021 బైక్సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకుంది. హీరో లీ జూన్-గి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్ ఎంత పాపులర్ అయిందంటే, దీనిని ‘దురంగా’ పేరుతో ఇండియన్ వెర్షన్‌గా కూడా రీమేక్ చేశారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా రీమేక్ చేశారు. చైనాలో కూడా దీని రీమేక్ పనులు జరుగుతున్నాయి. ఇది కొరియన్ డ్రామాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రేటింగ్ పొందింది. 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ను మీరు MX Player లో తెలుగు ఆడియోతో ఫ్రీగానే చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హీరో బేక్ హీ-సంగ్ తన భార్య, కూతురితో కలిసి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అందరి కళ్లలో అతను ఒక ఆదర్శవంతమైన భర్త. కానీ అతని గతం ఎవరికీ తెలియని ఒక పెద్ద రహస్యం. అతను తన అసలు పేరును, గతాన్ని దాచిపెట్టి వేరొకరి వేషంలో బతుకుతుంటాడు. అయితే 15 ఏళ్ల కిందట జరిగిన ఒక సీరియల్ కిల్లింగ్ కేసు మళ్ళీ వెలుగులోకి రావడంతో, అతని గతం అతన్ని వెంటాడటం మొదలవుతుంది. ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే, హీరో భార్య ఒక పోలీస్ డిటెక్టివ్. ఆమె ఒక సీరియల్ కిల్లర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో, అన్ని ఆధారాలు తన భర్త వైపే చూపిస్తాయి.

తను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి వెనుక ఇంత పెద్ద క్రైమ్ స్టోరీ ఉందా అని ఆమె తల్లడిల్లిపోతుంది. తన వృత్తికి, ప్రేమకు మధ్య ఆమె చేసే పోరాటం ఈ కథలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ, హీరో నిజంగానే నేరస్తుడా లేక పరిస్థితుల ప్రభావం వల్ల బలి అయ్యాడా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో స్టోరీ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసలు ఇందులో విలన్ ఎవరు? హీరో నిజంగానే హత్యలు చేశాడా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కారునే ఆఫీసుగా మార్చే క్రిమినల్ లాయర్… ఓటీటీలో అదరగొడుతున్న లీగల్ డ్రామా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×