// // Suspense Thriller ott : IMDbలో 7.4 రేటింగ్‌ ఉన్న 2 గంటల -->
E-Paper
Advertisement

Suspense Thriller ott : IMDbలో 7.4 రేటింగ్‌ ఉన్న 2 గంటల 15 నిమిషాల థ్రిల్లర్… 9 నెలల తరువాత ఓటీటీలోకి… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Suspense Thriller ott : IMDbలో 7.4 రేటింగ్‌ ఉన్న 2 గంటల 15 నిమిషాల థ్రిల్లర్… 9 నెలల తరువాత ఓటీటీలోకి… నరాలు కట్టయ్యే సస్పెన్స్
Advertisement

Suspense Thriller ott : ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌ల కోసం వెతుకుతూ ఉంటారు. ఈ జోనర్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కూడా. అలాంటి జోనర్ సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 2 గంటల 15 నిమిషాల ఈ సినిమా మర్డర్ మిస్టరీ తో ఉత్కంఠంగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని, ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఇది ఏం సినిమా అంటే

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు “ఎలెవెన్” (Eleven). ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.రియా హరి, అభిరామి, శశాంక్ కీలక పాత్రల్లో నటించారు. 2025 మే 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. ఇది వరకే prime video, aha ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తొమ్మిది నెలల తర్వాత జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇప్పుడు హిందీ డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకి IMDbలో 10/7.4 రేటింగ్‌ కలిగి ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరవింద్ (నవీన్ చంద్ర) ఒక అంతుచిక్కని సీరియల్ కిల్లర్ కేసును ఛేదించే కేసును డీల్ చేస్తాడు. ఆ హంతకుడు పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో హంతకుడు వదిలి వెళ్ళే క్లూస్ పోలీసులను తప్పుదోవ పట్టించేలా ఉంటాయి. అరవింద్ తన తెలివితేటలతో, ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.

ఇందులో ఈ హత్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, హంతకుడి గతానికి సంబంధించిన షాకింగ్ నిజాలు బయటపడతాయి. పోలీసు వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ హంతకుడు ఆడే మైండ్ గేమ్స్ ఉత్కంఠను పెంచుతాయి. చివరకు అరవింద్ తన జీవితాన్ని పణంగా పెట్టి, ఆ సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు అనే ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌తో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also :  పొరపాటున కాలంలో వెనక్కెళ్ళే కుర్రాడు… క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ… అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×