E-Paper
Advertisement

Survival Thriller OTT : మనుషుల్ని పురుగుల్లా చంపేసే స్పైడర్స్… ఒళ్లు జలదరించే సీన్స్ సామీ

Survival Thriller OTT : మనుషుల్ని పురుగుల్లా చంపేసే స్పైడర్స్… ఒళ్లు జలదరించే సీన్స్ సామీ
Advertisement

Survival Thriller OTT : సర్వైవల్ జానర్లో వచ్చే చాలా సినిమాలు చూడ్డానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రాణాల మీదకు వచ్చాక వాళ్ళు దాని నుంచి ఎలా బయట పడతారు ? అనేది ఆసక్తికరంగా , స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఇలాంటి కథలు స్లోగా సాగినా, లేదా పరుగులు పెట్టినా క్లైమాక్స్ వరకు సీటుకి కట్టిపడేస్తాయి ప్రేక్షకులను. మనసును మెలిపెట్టే ఎమోషన్ నుంచి, శ్వాస తీసుకోవడం మర్చిపోయేంత ట్విస్టులు కూడా ఉంటాయి. మీకు కూడా ఇలాంటి సినిమాలు అంటే ఇష్టమా ? అయితే ఈ మూవీ మీకోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 2024లో విడుదలైన ఫ్రెంచ్ హారర్ థ్రిల్లర్ ‘ఇన్‌ఫెస్టెడ్’ (Infested) అనే మూవీ గురించి. సియాగ్ బౌలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తియోడోర్ పెల్లెరిన్,ఫిన్న్ టౌఫిక్, జిరాఫే రైచెర్, ఎమిలీ బోష్, జిరాఫే రైచెర్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. 1 గంట 45 నిమిషాలు రన్‌టైమ్ న్ ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‌లో ప్రీమియర్ అయ్యింది. అక్కడ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న ఈ మూవీకి IMDbలో 6.8 రేటింగ్ ఉంది. మూవీకి బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ మంచి వసూళ్లు సాధించింది.ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  సినీయర్ అమ్మాయితో లవ్… ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ స్టోరీ… లవ్ లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

స్టోరీలోకి వెళ్తే…

పారిస్‌ లోని ఒక ఓల్డ్ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ లో కథ నడుస్తుంది. కియాస్ అనే అబ్బాయికి ఒక వింత హ్యాబిట్ ఉంటుంది. తన ఫ్రెండ్ జున్ (ఫిన్న్ టౌఫిక్)తో కలిసి ఆన్‌ లైన్‌ లో ఎక్సాటిక్ స్పైడర్స్ ను కలెక్ట్ చేస్తాడు. అదే విధంగా ఓ రోజు అతను ఒక అనామకుడి దగ్గర రేర్ స్పైడర్ స్పెసీస్ ను కొనుక్కొస్తాడు. ఓ చిన్న బాక్స్‌ లో దాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక ఇలాంటి పురుగుల కోసమే ప్రత్యేకంగా వెదర్, వేడి ఉండేలా ప్లాన్ చేస్తాడు. వాటిని అన్నింటినీ బాక్స్ లలో పెట్టి, ఫుడ్ కూడా వేస్తాడు. కానీ కొత్త స్పైడర్ ను మాత్రం తీసుకొచ్చిన బాక్స్ ‌లోనే ఉంచి, ఏదో తొందరలో బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఆ స్పైడర్ బాక్స్ నుంచి ఎస్కేప్ అయి అపార్ట్‌మెంట్‌ లో అంటురోగంలా స్ప్రెడ్ అవుతుంది.

Advertisement

అపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా బూజు పట్టేస్తుంది. కదిలిస్తే కుప్పలు తెప్పలుగా స్పైడర్లు బయటకు వస్తాయి. ఇక ఆ పురుగు కొడితే మనుషులు అక్కడిక్కడే చనిపోతారు. ఈ షాకింగ్ సంఘటన ఆ అపార్ట్మెంట్లో ఉన్న అందరి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. బయట నుంచి ఎవ్వరూ లోపలకు రాలేరు. అలాగే లోపల ఉన్నవాళ్ళు బయటకు వెళ్లలేరు అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. హీరో కియాస్ తో పాటు జున్, అల్బెర్ట్ (జిరాఫే రైచెర్), లియా (ఎమిలీ బోష్) అంతా లోపలే ట్రాప్ అవుతారు. మరి వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×