E-Paper
Advertisement

చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్

చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Horror Thriller: కాలేజీ పూర్తయ్యాక స్నేహితులతో కలిసి ఓ గుర్తుండిపోయే ట్రిప్‌కు వెళ్లాలని చాలామంది కలలు కంటారు. కానీ అదే ట్రిప్ ప్రాణాల కోసం చేసే పోరాటంగా మారితే ? సముద్రం అడుగున ఉన్న ఓ ప్రమాదకరమైన గుహలో చిక్కుకుని, బయటకు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోతే ? అంతేకాదు… అదే గుహలో ఆకలితో తిరుగుతున్న ఓ భారీ బుల్ షార్క్ కూడా ఉంటే ? ఇలాంటి గుండెల్లో దడ పుట్టించే కథతో తెరకెక్కిన హాలీవుడ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ ‘The Devil’s Mouth’. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కాలేజీ చదువు పూర్తయిన సందర్భంగా ఐదుగురు స్నేహితులు కలిసి థాయిలాండ్‌కు విహారయాత్రకు వెళ్తారు. సాధారణ టూరిస్టుల్లా బీచ్‌లు చూసి తిరిగి రావడం వారికి నచ్చదు. అందరూ వెళ్లడానికి భయపడే ఒక రహస్య సముద్ర గుహను విజిట్ చేయాలని నిర్ణయించుకుంటారు. అక్కడి స్థానికులు ‘ది డెవిల్స్ మౌత్’ అని పిలిచే ఆ గుహ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తారు. లోపలికి వెళ్లిన వారు సురక్షితంగా తిరిగి రావడం చాలా అరుదని కూడా చెబుతారు. అయినా సాహసమే లక్ష్యంగా డైవింగ్ సామగ్రితో ఆ ఐదుగురు గుహలోకి అడుగు పెడతారు.

Advertisement

మొదట గుహలోని అద్భుతమైన దృశ్యాలు చూసి ఆనందపడిన వారు, కొద్దిసేపటికే ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటారు. సముద్రంలో ఒక్కసారిగా భారీ తుఫాను రావడంతో గుహలోకి వచ్చిన మార్గాలన్నీ రాళ్లతో మూసుకుపోతాయి. బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ వారి కష్టాలు అక్కడితో ముగియవు. తుఫాను కారణంగా సముద్రం నుంచి ఒక భారీ బుల్ షార్క్ కూడా అదే గుహలోకి చేరుతుంది. ఆకలితో ఉన్న ఆ రాక్షస చేప నీటిలో కదిలే ప్రతి వస్తువునూ వేటాడడం మొదలు పెడుతుంది. ఇక ఒకవైపు తగ్గిపోతున్న ఆక్సిజన్… మరోవైపు బయటకు వెళ్లే దారి లేకపోవడం… ఇంకోవైపు క్షణక్షణం వెంటాడే షార్క్… ఈ మూడు ప్రమాదాల మధ్య వాళ్ళు ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

గుహలోని ఒక్కో దారి కొత్త ప్రమాదానికి దారి తీస్తుంది. చిన్న తప్పు చేసినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో స్నేహితుల మధ్య భయం, ఆందోళన మరింత పెరుగుతుంది. పరిస్థితులు కఠినంగా మారుతున్న కొద్దీ వారి ధైర్యం, సమయస్ఫూర్తి, పరస్పర నమ్మకమే వారికి చివరి ఆశగా మారుతుంది. చివరికి ఆ ఐదుగురు స్నేహితులు ఆ గుహ నుంచి ప్రాణాలతో బయట పడగలిగారా ? బుల్ షార్క్ బారి నుంచి ఎలా తప్పించుకున్నారు ? ‘ది డెవిల్స్ మౌత్’లో దాగి ఉన్న అసలు ప్రమాదం ఏమిటి ? చివరి వరకు వారందరూ కలిసి బతికి బయటపడ్డారా ? లేక ఆ గుహ మరో బలిని తీసుకుందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

హాలీవుడ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ ‘ది డెవిల్స్ మౌత్’లో కేథరిన్ న్యూటన్, లానా కాండర్, గావిన్ కాసలెగ్నో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠతో సాగే ఈ సినిమాను వీకెండ్‌లో తప్పకుండా ట్రై చేయొచ్చు.

Read Also: ఓవర్‌టేక్ చేసినందుకే నరకం చూపించే సైకో… ఈ రోడ్ రేజ్ థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×