E-Paper
Advertisement

బాబోయ్ ఇదేం స్టోరీ ? ఈ కాలేజీలో అడుగు పెడితే ఖతం… ఒంటరిగా చూడాల్సిన హర్రర్ మూవీ

బాబోయ్ ఇదేం స్టోరీ ? ఈ కాలేజీలో అడుగు పెడితే ఖతం… ఒంటరిగా చూడాల్సిన హర్రర్ మూవీ
Advertisement

Horror Thriller Movie : మంచి హుషారు వచ్చినప్పుడు చాలా మంది విజిల్ వేస్తూ ఉంటారు. ముఖ్యంగా థియేటర్లలో ఎలివేషన్ సీన్స్ వచ్చాయంటే చాలు విజిల్స్ తో ఊదరగొడుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మాత్రం అట్లా విజిల్ వేశారంటే పైలోకానికి టిక్కెట్టు కన్ఫామ్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘విజిల్’ (Whistle). ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక ప్రాచీన శాపం చుట్టూ తిరుగుతుంది. ‘ది నన్’ (The Nun) చిత్ర దర్శకుడు కొరిన్ హార్డీ దీనికి దర్శకత్వం వహించారు. క్రిస్ విల్లెట్ (డాఫ్నే కీన్) కొత్తగా స్కూల్‌ లో చేరిన అమ్మాయి పాత్రను పోషించింది. స్కూల్‌ లోని ఇతరులతో కలవలేక విడిగా ఉండే కొందరు విద్యార్థులు అంటే అవుట్‌కాస్ట్స్ గుంపు చుట్టూ కథ సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది మూవీ.

కథలోకి వెళ్తే…

Advertisement

క్రిస్ విల్లెట్ అనే అమ్మాయి ఒక కొత్త హైస్కూల్‌ లో చేరుతుంది. అక్కడ ఆమెకు కొందరు స్నేహితులు పరిచయమవుతారు. ఒకరోజు ఈ విద్యార్థుల బృందానికి అనుకోకుండా అత్యంత పురాతనమైన, రహస్యమైన ఒక అజ్టెక్ డెత్ విజిల్ దొరుకుతుంది. మొదట్లో అది కేవలం ఒక వింత వస్తువు అనుకుని సరదాగా భావిస్తారు. అలా వారిలో ఒకరు ఆ ఈలను గట్టిగా ఊదుతారు. ఆ విజిల్ నుండి అత్యంత భయంకరమైన, వింతైన ధ్వని వస్తుంది. ఆ శబ్దం వినబడిన క్షణం నుండే వారి జీవితాలు తలకిందులవుతాయి.

ఆ విజిల్ ఊదడం వల్ల శాపం యాక్టివేట్ అయి, భవిష్యత్తులో వారు ఏ విధంగా చనిపోబోతున్నారో ముందే తెలుస్తుంది. ఆ మరణమే ఒక భయంకరమైన రూపంలో వచ్చి వారిని వెంటాడటం ప్రారంభిస్తుంది. ఆ శబ్దం విన్న విద్యార్థులు ఒక్కొక్కరుగా చాలా వింతైన, ఘోరమైన పరిస్థితుల్లో చనిపోతుంటారు. మిగిలిన వారు తమ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గమనించి, ఆ మరణ రూపాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతారు. తాము చేసిన తప్పు వల్ల ఒకరి తర్వాత ఒకరు బలవుతున్నామని గ్రహించిన క్రిస్, ఆమె స్నేహితులు, ఆ చైన్ రియాక్షన్‌ను ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంటారు. ఆ భయంకరమైన శాపం నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు ? ఆ డెత్ విజిల్ వెనుక ఉన్న పురాతన రహస్యం ఏంటి ? శాపం ఆగిందా లేదా ? అనేదే ఈ సినిమా మిగతా కథ. హర్రర్ తో పాటు మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Advertisement

Read Also : నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న హై-వోల్టేజ్ ఎరోటిక్ థ్రిల్లర్స్… ఒంటరిగా చూడాలి మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×