E-Paper
Advertisement

సమయాన్ని దొంగిలించే శక్తులు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మరో మాస్టర్ పీస్

సమయాన్ని దొంగిలించే శక్తులు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మరో మాస్టర్ పీస్
Advertisement

Fantasy Horror drama: వృద్ధాప్యం వస్తే పింఛన్ తీసుకోవడం కాకుండా ఇంకా ఏమేం చేస్తారు ? అప్పటికే బాధ్యతలు అన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి కృష్ణా రామా అనుకుంటూ, గతాన్ని తలుచుకుంటూ ఓ మూలాన కూర్చుంటారు. మీరు కూడా ఇలాగే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఓల్డ్ బ్యాచ్ అంతా కలిసి చేసే అడ్వెంచర్ ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ సిరీస్ పేరే ‘ది బరోస్’ (The Boroughs). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్న విశేషాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ న్యూ మెక్సికో ఎడారి మధ్యలో ఉన్న ‘ది బరోస్’ అనే విలాసవంతమైన రిటైర్‌మెంట్ కమ్యూనిటీలో మొదలవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ఓల్డేజ్ హోమ్. భార్యను కోల్పోయిన బాధలో ఉన్న సామ్ కూపర్ అనే సినీయర్ సిటిజన్ మన హీరో. తనకు ఇష్టం లేకపోయినా ఈ కాలనీలోకి వస్తాడు. మొదట్లో అంతా మామూలుగానే ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి అతని స్నేహితుడు జాక్ ను ఒక అతీంద్రియ జీవి దారుణంగా చంపేస్తుంది.

Advertisement

సామ్ కళ్లారా చూసిన ఆ దృశ్యం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ జీవి సాధారణ రాక్షసి కాదు. అది మనుషుల మెదడులోని ఒక ప్రత్యేక ద్రవాన్ని పీల్చుకుంటూ, వారి జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని దొంగిలిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి మీద మాత్రమే కాకుండా, ఆ కాలనీలోని అనేక మంది వృద్ధులపై ఆ రాక్షసి దాడి చేస్తుంది. ఈ భయంకర సత్యాన్ని తెలుసుకున్న సామ్ ఒంటరిగా ఈ పోరాటం చేయడం సాధ్యం కాదని గ్రహిస్తాడు.

అప్పుడే జాక్, రెనీ, జూడీ, వాలీ, ఆర్ట్ వంటి తోటి వృద్ధులను కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళను తమను తాము ‘ది గ్రే రెబెలియన్’ అని పిలుచుకుంటారు. ఈ వృద్ధుల గుంపు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బాధ, ఆశలు ఉంటాయి. కానీ ఆ భయంకర జీవిని ఓడించడానికి వీళ్ళంతా ఒక్కటవుతారు. ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ సమయాన్ని కాపాడుకోవాలని, తమ కాలనీని, అలాగే ప్రపంచాన్ని కాపాడుకోవాలని డిసైడ్ అవుతారు.

Advertisement

ఈ క్రమంలో కాలనీ మేనేజర్ బ్లెయిన్ షా ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారుతుంది. అతని ప్రవర్తన ఎందుకు అలా ఉంది ? ఆ అతీంద్రియ జీవి ఎక్కడి నుండి వచ్చింది ? దాని టార్గెట్ ఏంటి అసలు ? అనే ప్రశ్నలకు సమాధానం కావలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

ప్రశాంతమైన ఎడారి ప్రాంతంలో ఒక అందమైన రిటైర్‌మెంట్ కాలనీ… పైకి చూస్తే ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న భయంకరమైన రహాస్యమే ఈ సిరీస్ కథ. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ డఫర్ బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పని చేసిన ఈ సిరీస్ Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. 2026 మే 21న విడుదలైన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ హారర్ అద్భుతంగా ఉంటుంది.

Read Also:

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×