E-Paper
Advertisement

తొలి తెలుగు సిరీస్ ‘సూపర్ సుబ్బు’ రిలీజ్ డేట్ ఇదేనా ?

తొలి తెలుగు సిరీస్ ‘సూపర్ సుబ్బు’ రిలీజ్ డేట్ ఇదేనా ?
Advertisement

Netflix Telugu Original : నెట్‌ఫ్లిక్స్ తన మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్‌ ‘సూపర్ సుబ్బు’తో భారీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలం క్రితం ప్రకటించిన ఈ సిరీస్ అప్డేట్ తాజాగా ఓటీటీలో కనిపించడంతో ఫ్యాన్స్ లో హైప్ ఏక్కువైంది. మరి ఇంతకీ ఈ సిరీస్ ను ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చు ? నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ విషయంలో ఇచ్చిన హింట్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

సుబ్బు (సందీప్ కిషన్) దురదృష్టం తలపై తాండవం చేసే యువకుడు. అతని జీవితం ఎప్పుడూ సరదాగా సాగదు. ఇంట్లో కఠినమైన, కన్జర్వేటివ్ తండ్రి (మురళీ శర్మ) ఒత్తిడి, ఉద్యోగం, పెళ్లి విషయాల్లో అతను నిరంతరం సమస్యలు ఎదుర్కొంటాడు. 60 మంది అమ్మాయిలు తిరస్కరించిన తర్వాత కూడా అతని జీవితం మారదు. ఒకరోజు అతని జీవితం పూర్తిగా తలక్రిందులవుతుంది. మారుమూల గ్రామం మాఖీపూర్‌లో అడల్ట్ సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌ గా అతన్ని నియమిస్తారు. నిజానికి ఆ గ్రామం చాలా కన్జర్వేటివ్, ఈ విషయంపై మాట్లాడటమే తప్పు అక్కడ.

Advertisement

అయితే సుబ్బు ఏమో వర్జిన్, ఈ సబ్జెక్ట్ గురించి పెద్దగా తెలియని వ్యక్తి. ఇప్పుడు అతను గ్రామస్తులకు ఆ ఎడ్యుకేషన్ నేర్పించాలి. అదే సమయంలో తన కఠిన తండ్రికి ఈ విషయం తెలియకుండా దాచుకోవాలి. ఈ ప్రక్రియలో సుబ్బు ఎన్నో హాస్యాస్పదమైన, ఆవేదనాకరమైన, ఎమోషనల్ సిట్యువేషన్స్ ఎదుర్కొంటాడు. గ్రామంలోని వివిధ వ్యక్తులు, వారి సమస్యలు, సంప్రదాయాలు – అన్నీ ఈ సిరీస్‌లో సరదాగా, సెన్సిటివ్‌గా చూపిస్తారు. కామెడీ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ సిరీస్ ద్వారా.

Also Read : ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?

స్ట్రీమింగ్ ఎప్పుడు ?

Advertisement

సందీప్ కిషన్ టైటిల్ రోల్‌ లో నటిస్తున్నాడు. మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా కనిపించనుంది. మురళీ శర్మ (తండ్రి పాత్ర), బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శ్రీను, మానస చౌదరి వంటి సూపర్ కమెడియన్స్ ఉన్నారు. రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మాణం. డైరెక్టర్ మల్లిక్ రామ్. నెట్‌ఫ్లిక్స్ లో టీజర్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ గురించి. గ్రామీణ నేపథ్యం, సామాజిక సమస్యను కామెడీగా చెప్పడం అనేది తెలుగు ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వనుంది. జూన్‌లో విడుదల కాబోతున్న ఈ సిరీస్ తాజాగా నెట్ ఫ్లిక్స్ కమింగ్ సూన్ సెక్షన్ లో దర్శనం ఇచ్చి, టాలీవుడ్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది. దీంతో ఈ సిరీస్ జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జోరందుకుంది. కానీ దీనిపై ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Also Read : పోలీస్ అధికారి లోడెడ్ గన్ మిస్సింగ్… ఈ మలయాళం మూవీలో ఒక్కో ట్విస్టు మెంటల్ మాస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×