E-Paper
Advertisement

ఇంట్లో ఉండి విసుగు వస్తోందా ? IMDbలో అదిరిపోయే రేటింగ్‌ ఉన్న ఈ సినిమాలు సిరీస్‌లపై ఒక లుక్కేయండి

ఇంట్లో ఉండి విసుగు వస్తోందా ? IMDbలో అదిరిపోయే రేటింగ్‌ ఉన్న ఈ సినిమాలు సిరీస్‌లపై ఒక లుక్కేయండి
Advertisement

Zee 5 Best Web Series : ఈ వీకెండ్ కి ఓటీటీలో మంచి కంటెంట్ కోసం చూస్తున్నారా ? అయితే మీ డెస్టినేషన్ ఈ వారం ZEE5 బెస్ట్ కావచ్చు. ఎందుకంటే ఈ ఓటీటీలో ఎమోషనల్, కామెడీ, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్‌ వంటి జానర్లలో తెరకెక్కిన ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న సిరీస్‌ లు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే, చివరి వరకు కట్టిపడేస్తాయి. అలాగే IMDbలో అద్భుతమైన రేటింగ్‌ ను పొందాయి. కాబట్టి జీ5లో ఉన్న ఆ బెస్ట్ సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

Sirf Ek Bandaa Kaafi Hai
ఒక సాధారణ న్యాయవాది ఒక పెద్ద పేరున్న వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులో ఎలా ఫైట్ చేశాడు అన్నది స్టోరీ. ఈ పవర్ ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామాలో మనోజ్ బాజ్‌పేయ్ నటన హైలెట్ గా ఉంటుంది. దీనికి ఐఎండీబీలో 7.9 రేటింగ్ లభించింది.

Advertisement

TVF Pitchers
నలుగురు స్నేహితులు కలిసి ఒక స్టార్టప్‌ను స్టార్ట్ చేయాలని అనుకుంటారు. అందుకోసం ఏకంగా తమ ఉద్యోగాలను వదిలేసి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ అంతా కలిసి అనుకున్నది ఎలా సాధించారు ? అన్నది కథ. స్నేహం, కష్టాలు, కలలు వంటి ఎమోషనల్ అంశాలతో పాటు… ఇందులో ఉండే తేలికపాటి కామెడీ యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి ఐఎండీబీలో 9.1 రేటింగ్ కూడా ఉంది.

ముఖ్‌బీర్
ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న స్పై థ్రిల్లర్ ఇది. దీని కథ అంతా 1965 నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ వ్యక్తిని శత్రు దేశంలో గూఢచారిగా పంపడంతో కథ షురూ అవుతుంది. దేశభక్తి, సస్పెన్స్‌ల చక్కని కలయికతో రూపొందిన ఈ సిరీస్ ను చూసి తీరాల్సిందే.

Advertisement

Abhay
ఐఎండీబీలో 8 రేటింగ్ సంపాదించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘అభయ్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ లో ఒక పోలీస్ అధికారి క్లిష్టమైన కేసును ఎలా పరిష్కరించాడో చూడొచ్చు. ప్రతి ఎపిసోడ్ లో వచ్చే కొత్త కొత్త కేసులు ప్రేక్షకులను భలే ఆకట్టుకుంటాయి.

Sunflower series
ఇదొక మర్డర్ మిస్టరీ సిరీస్. ఒక సొసైటీలో జరిగిన హత్య, ఆ తర్వాత ఒక అబ్బాయి చేసే వింత పనులు, ఇన్వెస్టిగేషన్ లో అతనిపై అనుమానం రావడం వంటి పాయింట్స్ తో నడుస్తుంది స్టోరీ. ఇందులో సస్పెన్స్‌ తో పాటు ఫన్నీ సీన్స్ కూడా చాలా ఉంటాయి. ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది.

అయాలి
డాక్టర్ కావాలని కలలు కనే ఒక పల్లెటూరి అమ్మాయి కథ ఇది. కానీ సంప్రదాయాలు ఆమెకు అడ్డుగా నిలుస్తాయి. మరి ఆ కట్టుబాట్లను దాటి ఆ అమ్మాయి ఎలా డాక్టర్ అయ్యింది ? అనేదే కథ. ఐఎండీబీలో 8.5 రేటింగ్‌ ఉంది.

ట్రిప్లింగ్
ముగ్గురు తోబుట్టువుల చుట్టూ తిరిగే కథ ‘ట్రిప్లింగ్’. ఒంటరిగా ఇబ్బందులు పడుతున్న ఈ ముగ్గురూ కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభించడంతో వారి బంధం బలపడుతుంది. ఈ సిరీస్‌కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉండడం విశేషం.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×