E-Paper
Advertisement

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని దెయ్యంతో డీల్… కళ్ళముందే నరకం.. రాత్రి పూట చూడకూడని సినిమా

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని దెయ్యంతో డీల్… కళ్ళముందే నరకం.. రాత్రి పూట చూడకూడని సినిమా
Advertisement

OTT Movie : ఇండోనేషియన్ సినిమాలంటే మొదటగా దెయ్యాల సినిమాలే గుర్తుకు వస్తాయి. అక్కడ బ్లాక్ మ్యాజిక్ బాగా పాపులర్. అందుకే చేతబడి కాన్సెప్ట్ తో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి పిల్లలు పుట్టలేదని దయ్యాన్ని వేడుకుంటాడు. ఆ తరువాత వాళ్ళకి ట్విన్ సిస్టర్స్ పుడతారు. ఆ తరువాత అందులో ఒక బిడ్డకి దెయ్యం పోలికలు ఉన్నాయని తండ్రి గొంతు కోసి చంపేస్తాడు. ఇక ఆ స్పిరిట్ రివెంజ్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. ఈ సినిమాని ఒంటరిగా చూస్తే పక్కనే దెయ్యం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2024లో విడుదలైన ఈ ఇండోనేషియన్ సుపర్‌ నాచురల్ హారర్ మూవీ పేరు ‘సుమాలా’. రిజాల్ మంటోవాని డైరెక్షన్ లో లూనా మాయా (సులస్త్రి), దారియస్ సినాత్రియా (సోడ్జిమాన్), మాకాలా రోజ్ హిల్లీ (కుమాలా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వడంతో పాటు, ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సెమరాంగ్ అనే చిన్న గ్రామంలో సులస్త్రి, సోడ్జిమాన్ దంపతులకి పిల్లలు పుట్టడం లేదు. ఎంతమంది దేవుళ్ళకి పూజలు చేసినా ఫలితం లేదు. ఒక రోజు సోడ్జిమాన్ గుడిసె వెనకాల రాత్రి ఒక్కడే కూర్చుని పిల్లల కోసం డెవిల్‌ని ప్రార్థిస్తాడు. ఆ రాత్రే సులస్త్రి గర్భం దాల్చుతుంది. తొమ్మిది నెలల తర్వాత ట్విన్స్ పుడతారు. ఒకటి అందమైన కుమాలా, మరొక పాప భయంకరంగా, చూడటానికి దెయ్యంలా ఉండే సుమాలా. సోడ్జిమాన్ షాక్ అయి ఇది డెవిల్ పిల్ల అని సుమాలా గొంతు కోసేస్తాడు. శవాన్ని ఇంటి వెనక పాతేస్తాడు. సులస్త్రి ఏడుస్తూ ఉంటది కానీ భర్తని అడ్డుకోలేదు. ఇప్పుడు కుమాలాని మాత్రమే పెంచుకుంటారు. కానీ ఆమెకు కూడా పెరిగే కొద్ది కాళ్లు కొంచెం వంకరగా ఉంటాయి. గ్రామంలో అందరూ ఆమెని పిచ్చి పిల్ల, అపశకునం అని రోజూ రాళ్లు కొట్టి, ముఖంమీద ఉమ్మేసి, జుట్టు పట్టుకుని కొడుతుంటారు.

Read Also :  ఏడు ఆస్కార్లు గెలిచిన రియల్ స్టోరీ… హిట్లర్ దాష్టీకం నుంచి 1100 మందిని బతికించిన హీరో… ఇప్పటికీ టాప్ 10లో చోటు

Advertisement

కుమాలాకి 10 ఏళ్లు నిండగానే ఒక రాత్రి భయంకరమైన గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు సుమాలాదే! ఆ రోజు కుమాలా బాడీలోకి సుమాలా స్పిరిట్ పూర్తిగా ఎంటర్ అవుతుంది. ఆమెని గ్రామంలోని రోజూ ఏడిపించిన ఒక్కొక్కరిని భయంకరంగా చంపడం మొదలు పెడుతుంది సుమాలా స్పిరిట్. ఆ గ్రామం మొత్తం రక్తపు మడుగులో మునిగిపోతుంది. తర్వాత తండ్రి సోడ్జిమాన్‌ని కూడా ఇంట్లోనే గొంతు కోసేసి చంపేస్తుంది. తల్లి సులస్త్రి భయంతో వణుకుతూ నన్ను క్షమించు అని వేడుకుంటుంది. కానీ ఆమెని కూడా దారుణంగా చంపేస్తుంది. చివరికి కుమాలా బాడీ నుంచి సుమాలా బయటికి వస్తుందా ? ఆ గ్రామంలో ఎవరైనా బతుకుతారా ? ఈ కథకు క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ సుపర్‌ నాచురల్ హారర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×