E-Paper
Advertisement

OTT Movie : ఆడపిల్లలే టార్గెట్… అమ్మాయి కాదు కాటేరమ్మ… సింగిల్ మదరా మజాకా

OTT Movie : ఆడపిల్లలే టార్గెట్… అమ్మాయి కాదు కాటేరమ్మ… సింగిల్ మదరా మజాకా
Advertisement

OTT Movie : ఓటిటిలో ఎన్నో థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని సినిమాలు ఆడియన్స్ ని కుర్చీలకే పరిమితం చేస్తూ, సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక అమ్మాయి మిస్సింగ్ తో మొదలవుతుంది. ఆమెను కాపాడుకోవడానికి, తల్లి చేసే వీరోచిత పోరాటమే ఈ కథ. ఊహించని ట్విస్టులు, టెన్షన్ పెట్టించే సస్పెన్స్ తో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో ఉందంటే

‘స్టోలెన్ ఫ్రమ్ సబర్బియా’ (Stolen from suberbia) ఒక అమెరికన్ థ్రిల్లర్ సినిమా. అలెక్స్ రైట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సింథియా వాట్రోస్, సిడ్నీ స్వీనీ, ఓలివియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 ఆగస్టు 30న రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్ తో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

కేథరిన్ అనే మహిళకి భర్త చనిపోయి ఉంటాడు. ఆమెకు పదహారేళ్ళ ఎమ్మా అనే కూతురు ఉంటుంది. వీళ్ళు కలిఫోర్నియాలో ఒక కొత్త ఇంటికి మారుతారు. కేథరిన్ తన కూతురు వయసులో ఉండటంతో జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుంది. ఎమ్మాకి స్కూల్‌లో కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఆమె ఆంట్ అనే వ్యకిని బాయ్‌ ఫ్రెండ్ గా చూస్ చేసుకుంటుంది. అయితే ఎమ్మాకు కేథరిన్ కొన్ని రూల్స్ పెడుతుంది. బాయ్‌ఫ్రెండ్‌ ఎవరైనా ఉంటే, రాత్రి పూట బయటికి వెళ్లకుండా ఇంటికే తీసుకురమ్మని చెప్తుంది. కానీ ఎమ్మా ఆమెకు తెలీకుండా ఆంట్‌తో డేట్‌కు వెళ్తుంది. అప్పుడు మిలెనా అనే మహిళ ఎమ్మాకి డ్రగ్స్ ఇచ్చి కిడ్నాప్ చేస్తుంది. మిలెనా ఒక హ్యూమన్ ట్రాఫికర్, ఎమ్మాను అమ్మాలని ప్లాన్ చేస్తుంది.

Read Also : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

Advertisement

ఎమ్మా ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కేథరిన్ భయపడుతుంది. వెంటనే ఈ విషయం పోలీసులకు చెబుతుంది. కానీ పోలీసులు ఎమ్మా పారిపోయిందని అనుకుని సీరియస్‌గా తీసుకోరు. ఇక చేసేదేమీ లేక కేథరిన్ ఒక్కటే ఎమ్మాను వెతకడం మొదలెడుతుంది. ఈ సమయంలో మిలెనా గురించి కేథరిన్ తెలుసుకుంటుంది. వాళ్లు అందమైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి వేశ్యలుగా మారుస్తూ, అమ్ముతుంటారని తెలుసుకుంటుంది. ఎమ్మాను కాపాడుకోవడానికి కేథరిన్ మిలెనా గ్యాంగ్ తో ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ మిలెనాని కేథరిన్ ఓడిస్తుందా ? తన కూతుర్ని కాపాడుకుంటుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×