E-Paper
Advertisement

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ
Advertisement

OTT Movie : మహిళల కోసం సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంటుంది. రీసెంట్ గా ‘స్థల్’ అనే మరాఠీ మూవీ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. అంతర్జాతీయంగా అవార్డ్ లను కూడా గెలుచుకుంది. ఇది టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో NETPAC అవార్డ్, 2024 పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ మరాఠీ ఫిల్మ్, లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆడియెన్స్ అవార్డ్ గెలిచింది. ఈ కథ బాల్య వివాహాల చుట్టూ తిరుగుతుంది. పేద అమ్మాయిలకు చదువు ఎంత ముఖ్యమో ఈ మూవీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘స్థల్’ (Sthal) 2025లో వచ్చిన మరాఠీ సినిమా. జయంత్ దిగంబర్ సోమల్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో, నందిని చిక్టే, తారానాథ్ ఖిరట్కర్, సంగీతా సోనేకర్, సుయోగ్ ధావస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మార్చి 7 ఉమెన్స్ డే రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 10 నుంచి ZEE5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. IMDbలో 7.1/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో దౌలత్రావ్, లీలాబాయ్ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. 16 ఏళ్ల సవితా అనే కూతురు, మంగేష్ అనే కొడుకు ఉంటారు. అయితే ఇక్కడ చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తుంటారు. పెళ్ళికి ముందు అబ్బాయిలు, నచ్చిన అమ్మాయిని ఎంచుకుంటారు. ఈ క్రమంలో సవితా తల్లిదండ్రులు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. కానీ సవితాకి అందం, డబ్బు లేకపోవడం పోవడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ విషయంలో సవితా డిప్రెషన్ కి వెళ్తుంది.

Read Also : భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

అయితే సవితా తల్లిదండ్రులు ఆమె పెళ్లి కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. పెళ్లి కాకపోతే, ఆమె జీవితం పాడవుతుందని వాళ్ళు భయపడతారు. ఈ సమయంలో సవితా తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. చదువుకుని మంచి స్థాయికి రావాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆమె తమ్ముడు మంగేష్ సవితాకు అండగా నిలబడతాడు. అయితే ఆమె తల్లిదండ్రులు దీనికి మొదట ఒప్పుకోరు. ఆ తరువాత ఆమె పట్టుదలను చూసి వాళ్ళు కూడా చదువుకోవడానికి అంగీకరిస్తారు. ఒక మంచి సోషల్ మెసేజ్ ఇస్తూ, ఈ సినిమా ముగుస్తుంది.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×