E-Paper
Advertisement

కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ
Advertisement

Romantic Movie: ఒకరిని దూరం నుంచి ప్రేమించడం… కానీ ఆ విషయం వారికి తెలియకపోవడం… అలాంటి ప్రేమ ఒక్కసారిగా నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది ? అదే సమయంలో ప్రేమ, ఆకర్షణ, కుటుంబ విభేదాలు అన్నీ ఒకేసారి ఎదురైతే ? ఇలాంటి యూత్ ఫుల్ ప్రేమకథతో తెరకెక్కిన స్పానిష్ రొమాంటిక్ డ్రామా ‘Through My Window’. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో కూడా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా కథ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

రాక్వెల్ అనే కాలేజీ విద్యార్థిని తన పక్కింట్లో ఉండే అరెస్ హిడాల్గోను చాలా కాలంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ తన ప్రేమ విషయం అతనికి చెప్పే ధైర్యం మాత్రం ఆమెకు ఉండదు. ప్రతిరోజూ తన గది కిటికీలోంచి అతన్ని చూస్తూ, ఒకరోజైనా మాట్లాడే అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తుంటుంది. అరెస్ మాత్రం సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. అతని లైఫ్ స్టైల్, ఆలోచనలు, స్నేహితుల వర్గం అన్నీ రాక్వెల్ ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే అతను తనలాంటి అమ్మాయిని ఎప్పటికీ పట్టించుకోడని ఆమె అనుకుంటుంది.

Advertisement

ఒకరోజు చిన్న సంఘటన ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. రాక్వెల్ ఇంటి వై-ఫై కనెక్షన్‌ను అరెస్ ఉపయోగిస్తున్న విషయం బయట పడుతుంది. అదే ఇద్దరి మధ్య మొదటి పరిచయానికి కారణమవుతుంది. సాధారణంగా మొదలైన సంభాషణలు క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతాయి. అయితే వారి వ్యక్తిత్వాలు పూర్తిగా వేర్వేరుగా ఉండటంతో అపార్థాలు కూడా మొదలవుతాయి. అరెస్ తన భావాలను బయట పెట్టడానికి ఇష్టపడడు. మరోవైపు రాక్వెల్ మాత్రం ప్రేమను నిజాయితీగా నమ్ముతుంది. ఈ భిన్నమైన ఆలోచనలు ఇద్దరి మధ్య తరచూ దూరాన్ని పెంచుతుంటాయి.

ఇదిలా ఉండగా, అరెస్ కుటుంబం కూడా వారి బంధాన్ని సులభంగా అంగీకరించదు. కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత నిర్ణయాలు, భవిష్యత్తుపై భయాలు… ఇవన్నీ వారి ప్రేమను కఠిన పరీక్షకు గురిచేస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇద్దరూ ఎన్నో భావోద్వేగ సంఘటనలను ఎదుర్కొంటారు. ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదని… నమ్మకం, గౌరవం, త్యాగం కూడా అంతే ముఖ్యమని క్రమంగా ఇద్దరికీ అర్థమవుతుంది. చివరికి రాక్వెల్, అరెస్ ప్రేమ అన్ని అడ్డంకులను దాటిందా? వారి కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని అంగీకరించారా ? ఇద్దరి జీవితాలు అనుకున్నట్టుగా ముందుకు సాగాయా ? లేక ఈ ప్రేమ ఊహించని మలుపు తిరిగిందా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

స్పానిష్ రొమాంటిక్ డ్రామా ‘త్రూ మై విండో’లో క్లారా గల్లే, జూలియో పెనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Netflixలో తెలుగు డబ్బింగ్‌తో పాటు స్పానిష్, ఇంగ్లీష్, ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథకు కొనసాగింపుగా వచ్చిన ‘Through My Window: Across the Sea’, ‘Through My Window: Looking at You’చిత్రాలు కూడా అదే ఓటీటీ వేదికలో అందుబాటులో ఉన్నాయి.

Read Also: దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×