E-Paper
Advertisement

నచ్చినోడిపై వ్యామోహం… అతని భార్య శరీరాన్ని స్వైప్ చేసుకునే లేడీ సైకో

నచ్చినోడిపై వ్యామోహం… అతని భార్య శరీరాన్ని స్వైప్ చేసుకునే లేడీ సైకో
Advertisement

Horror Thriller : 2023లో విడుదలై హార్ట్‌బీట్ పెంచిన డార్క్ సైకలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ‘సోల్‌మేట్’ (Soulmate). పవన్ శర్మ దర్శకత్వం వహించిన ఈ 28 నిమిషాల చిత్రంలో హీనా ఖాన్ ప్రధాన పాత్రలో నటించింది. ప్రేమ, అసూయ, వ్యామోహం, బ్లాక్ మ్యాజిక్ కలిసిన ఈ షార్ట్ ఫిల్మ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరి ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అభిషేక్ మల్హోత్రా (వివాన్ భతేనా), కనికా మల్హోత్రా (హీనా ఖాన్) సంతోషంగా జీవితం సాగిస్తున్న దంపతులు. కానీ అభిషేక్ జీవితంలోకి అదా (మధురిమా రాయ్) అనే మహిళ ప్రవేశించడంతో సమస్యలు మొదలవుతాయి. అదాకు అభిషేక్ అంటే పిచ్చి ప్రేమ. అతన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆమె ఆశపడుతుంది. కానీ అభిషేక్ తన భార్య కనికాను ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే అదాను దూరం పెడతాడు. అభిషేక్ తనకు దక్కకపోవడానికి కనికయే కారణమని భావించిన అదా, ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటుంది.

Advertisement

ఆమె బ్లాక్ మ్యాజిక్ (తాంత్రిక పూజ) ద్వారా కనికా శరీరంలోకి తన ఆత్మను మార్చుకుంటుంది. ఇక కనికా శరీరంలో అదా ఆత్మ జీవితం సాగిస్తుంది. అభిషేక్‌ తో కలిసి ఉంటూ, ఆమె తన కోరికను తీర్చుకోవడం ప్రారంభిస్తుంది. కానీ ప్రకృతి నియమాలను ఉల్లంఘించి చేసిన ఈ చేతబడి వల్ల ఊహించని భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. కనికా నిజమైన ఆత్మ ఎక్కడికి పోయింది ? అభిషేక్ కనికా ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనించాడా ? అదా వేసిన ప్లాన్ చివరికి ఎలా బెడసికొట్టింది ? అనే ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. షార్ట్ ఫిల్మ్ కదా అని లైట్ తీసుకోకండి. ఖచ్చితంగా ఈ మూవీ ఓ మంచి హర్రర్ థ్రిల్లర్ ఇచ్చిన ఫీలింగ్ ను ఇస్తుందని గుర్తు పెట్టుకోండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

హీనా ఖాన్ కనికా పాత్రలో భావోద్వేగాలు, భయం, ఆవేశం అన్నీ అద్భుతంగా పలికించింది. ఆమె డ్యూయల్ రోల్ లాంటి ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలం. వివాన్ భతేనా అభిషేక్‌గా సహజంగా నటించాడు. మధురిమా రాయ్ అదా పాత్రలో వ్యామోహం, క్రూరత్వం రెండూ బాగా చూపించింది. 28 నిమిషాల్లోనే ప్రేమ, అసూయ, బ్లాక్ మ్యాజిక్, ట్విస్ట్‌లు అన్నీ ఒక్కసారిగా అందించే ఈ షార్ట్ ఫిల్మ్ ఒక్కసారి చూస్తే మరచిపోలేరు. ప్రస్తుతం మూడు ఓటీటీలు Eros Now, Apple TV, Amazon Prime Videoలో దీన్ని చూడవచ్చు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇష్టపడేవారు ఈ షార్ట్ ఫిల్మ్ ను ఒక్కసారైనా చూడాల్సిందే.

Advertisement

Read Also : తరతరాలుగా ఊరిని వణికించే దెయ్యం… చీకటంటేనే భయపడే హీరో చేసే రిస్క్ చూస్తే దిమాక్ ఖరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×