E-Paper
Advertisement

OTT Movie : మొగుడు మంచం మీద… ప్రియుడేమో మంచం క్రింద … వీడియో వైరల్ అయిపోతే

OTT Movie : మొగుడు మంచం మీద… ప్రియుడేమో మంచం క్రింద … వీడియో వైరల్ అయిపోతే
Advertisement

OTT Movie : భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాలను చూడకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో వీటిని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కన్నడ మూవీలో, కొంతమంది మనుషుల వల్ల అమాయకుల జీవితాలు ఎలా తల క్రిందులు అవుతాయో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జి ఫైవ్ (Zee5) లో

Advertisement

ఈ కన్నడ మూవీ పేరు ‘సూజిదార’ (Soojidaara). ఈ  కన్నడ మూవీని మౌనీష్ బాడిగర్ రచించి దర్శకత్వం వహించారు. సినీ స్నేహా టాకీస్‌ ​​బ్యానర్‌పై సచిద్రన్‌ ఆత్‌నాయక్‌, అభిజిత్‌ కోటేగర్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో హరిప్రియ, యశ్వంత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో యశ్వంత్ కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. సహాయక తారాగణంలో అచ్యుత్ కుమార్, సుచేంద్ర ప్రసాద్, చైత్ర కూటూరు నటించారు. ఈ శాండల్‌వుడ్‌ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

షబ్బీర్ ఊర్లు తిరుగుతూ, భయపడుతూ బ్రతుకుతూ ఉంటాడు. ఒక ఊరిలో ఇతన్ని ఎవరూ గుర్తుపట్టకపోవడంతో, అక్కడే తలదాచుకుని ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాడు. ఇతని పక్కనే నీలావతి అనే ఒక అమ్మాయి ఫ్యామిలీతో ఉంటుంది. మరోవైపు గీత, రంగా అనే భార్యాభర్తలు ఉంటారు. నీలావతికి నాటకాలు అంటే పిచ్చి. సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. రంగ అదే ఊర్లో నాటకాలు వేస్తుంటాడు. భార్య గీత మీద అనుమానంతో, తాళం వేసి పోతుంటాడు. ఇంటికి వచ్చాక ఆమెతో బలవంతంగా గడుపుతుంటాడు. అలా ఒక రోజు ఏడుస్తూ బయటికి వచ్చిన గీతకి షబ్బీర్ ఎదురవుతాడు. వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదురుతుంది. లీలావతి ఆడిషన్స్ కి వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాకుండా ఉంటుంది. కంగారుపడి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

షబ్బీర్ కూడా, గీతతో ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో గీత భర్త ఇంట్లోకి వస్తాడు. షబ్బీర్ మంచం కింద దాక్కుంటాడు. అయితే రంగ ఆమెతో బలవంతంగా గడుపుతాడు. అప్పుడే ఆమె వీపు మీద మచ్చని చూసి షబ్బీర్ షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు ఇది వరకు తాను చదువుకునే ప్రిన్సిపల్ కూతురు. ఆమె వీడియో ఒకటి లీక్ అవుతుంది. దానికి కారణం షబ్బీర్ అనుకొని  అనవసరంగా స్టూడెంట్స్ కొడతారు. అక్కడినుంచి తప్పించుకుని ఇలా బ్రతుకుతూ ఉంటాడు షబ్బీర్. చివరికి షబ్బీర్ లైఫ్ ఎటు పోతుంది? నీలావతి ఇంటికి తిరిగి వస్తుందా? గీత స్టోరీ ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సూజిదార’ (Soojidaara) అనే ఈ శాండల్‌వుడ్‌ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×