E-Paper
Advertisement

7/G Movie: ఓటీటీలోకి సోనియా అగర్వాల్ హారర్ థ్రిల్లర్ ‘7/G’.. ఎక్కడ చూడొచ్చంటే.?

7/G Movie: ఓటీటీలోకి సోనియా అగర్వాల్ హారర్ థ్రిల్లర్ ‘7/G’.. ఎక్కడ చూడొచ్చంటే.?
Advertisement

7/G Movie OTT: హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చాలామందికి ఈ జోనర్ ఫేవరెట్. అందుకే ఈ సినిమాలు థియేటర్లలో విడుదలయినా, ఓటీటీలో విడుదలయినా చాలావరకు సక్సెస్ అందుకుంటాయి. అలా మరొక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. అదే ‘7/G’. ఒకప్పుడు ఇదే టైటిల్‌లో ఒక ప్రేమకథ తెరకెక్కింది. అది క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు అదే టైటిల్, అదే హీరోయిన్‌తో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం విశేషం. థియేటర్లలో విడుదయ్యి పరవాలదేనిపించిన ‘7/G’.. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

సోనియా కమ్ బ్యాక్

Advertisement

ఒకప్పుడు సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా ‘7/G బృందావన్ కాలనీ’ అనే ప్రేమకథ తెరకెక్కింది. ఈ సినిమా విడుదలయ్యి ఎన్నో ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఇది ఫేవరెట్‌గా నిలిచిపోయింది. సోనియా అగర్వాల్ కెరీర్‌లో కూడా ఈ మూవీ చాలా స్పెషల్‌గా మిగిలిపోయింది. ఈ మూవీకి ముందు, తర్వాత సోనియా నటించిన సినిమాల గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ‘7/G బృందావన్ కాలనీ’ గురించి తెలియని ప్రేక్షకులు తక్కువే. అలాంటి పాపులారిటీ సంపాదించుకున్న సోనియా అగర్వాల్.. తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా టైటిల్‌తోనే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ బుల్లితెరపైకి వచ్చేసింది. ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

Also Read: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన విక్రమ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Advertisement

అదీ కథ

సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ నటించిన టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ‘7/G’. హరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో తెరకెక్కింది. అక్కడ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే మూవీ తెలుగులో డబ్ అయ్యి నేరుగా ఓటీటీలో విడుదలయ్యింది. ‘7/G’ కథ విషనికొస్తే.. రాజీవ్, వర్ష అనే దంపతులు ఐదేళ్ల కొడుకు రాహుల్‌తో కలిసి కొత్త ఫ్లాట్‌కి మారుతారు. అక్కడ ఏదో చెడు జరుగుతుందని వర్షకు అనిపిస్తుంది. వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి వర్ష ఎలాంటి పోరాటం చేసిందనే ‘7/G’ కథ. డిసెంబర్ 12 నుండి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×