E-Paper
Advertisement

Social Drama OTT : సోషల్ మీడియా ‘వికృతి’ చేష్టలకు అద్దంపట్టే మలయాళీ చిత్రం ఇది

Social Drama OTT : సోషల్ మీడియా ‘వికృతి’ చేష్టలకు అద్దంపట్టే మలయాళీ చిత్రం ఇది
Advertisement

Social Drama OTT : మలయాళం సినిమాలలోనే ఇప్పుడు మనం చెప్పికోబోయే సినిమా క్రేజీగా ఉంటుంది. ఇది కొచ్చి మెట్రోలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది. ఒక చిన్న అల్లరి పని, ఒక మనిషి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. ఈ సినిమాను చూస్తే మలయాళం సినిమాలు ఎందుకు క్రేజీగా ఉంటాయో తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎక్కడ ఉంది, దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘వికృతి’ (Vikruthi) 2019లో విడుదలైన ఒక మలయాళ కామెడీ డ్రామా సినిమా. 2019 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో సూరజ్ వెంజరమ్మూడు, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. డి. శ్రీకుమార్, గణేష్ మీనన్, లక్ష్మీ వారియర్‌లు దీనిని నిర్మించారు.ఈ చిత్రం తమిళంలో పయనిగల్ గవనిక్కవుమ్‌గా రీమేక్ చేయబడింది. ఐయండిబిలో దీనికి 7.4/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎల్డో (సూరజ్ వెంజరమ్మూడు) అనే వ్యక్తి తన అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రిలో చూసుకుని, రెండు రోజులు నిద్రలేక తీవ్రమైన అలసటతో ఇంటికి తిరిగి వస్తుంటాడు. కొచ్చి మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ అలసట వల్ల అతను సీటుపై పడుకుని నిద్రపోతాడు. అదే సమయంలో, గల్ఫ్ నుండి సెలవులకు వచ్చిన సమీర్ (సౌబిన్ షాహిర్) సరదా కోసం ఎల్డో ఫోటో తీస్తాడు. ఎల్డో తాగి ఉన్నాడని తప్పుగా భావించి, “కొచ్చి మెట్రోలో మొదటి తాగుబోతు” అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.

అయితే ఆ ఫోటో కొద్ది గంటల్లోనే వైరల్ అవుతుంది. ఎల్డోను అందరూ ఎగతాళి చేయడం మొదలుపెడతారు. మరుసటి రోజు పేపర్లలో కూడా ఆ వార్త వస్తుంది. సమాజంలో ఎల్డో, అతని కుటుంబం తీవ్రమైన అవమానానికి గురవుతారు. ఎల్డో ఉద్యోగానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. ఎల్డో కొడుకు తన తండ్రి తాగుబోతు కాదని, ఆయన మూగవాడని, ఆసుపత్రిలో అలసిపోయి అలా పడుకున్నాడని మీడియాకు వివరిస్తాడు. దీంతో సోషల్ మీడియాలో సమీర్‌పై వ్యతిరేకత మొదలవుతుంది. పోలీసులు సమీర్ కోసం వెతకడం మొదలు పెడతారు.  చివరికి సమీర్ తన తప్పును ఎలా సరిదిద్దుకున్నాడు? సమీర్‌ను ఎల్డో క్షమిస్తాడా? అనే అంశాలతో సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : ప్రపంచాన్ని చూసే కోణాన్ని మార్చేసే మూవీ… మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్… తెలుగులోనే స్ట్రీమింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×