// // చదువు ఉన్నా విధిని జయించలేక... పల్లెటూరి ఆచారాల మధ్య -->
E-Paper
Advertisement

చదువు ఉన్నా విధిని జయించలేక… పల్లెటూరి ఆచారాల మధ్య చిక్కుకున్న ఒక డాక్టర్ కథ

చదువు ఉన్నా విధిని జయించలేక… పల్లెటూరి ఆచారాల మధ్య చిక్కుకున్న ఒక డాక్టర్ కథ
Advertisement

Social Drama OTT : బెంగాలీ సినిమాలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే మలయాళం సినిమాల తరువాత ఈ సినిమాలే ఎక్కువ అదరణ పొందుతున్నాయి. గత ఏడాది మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అయ్యాయి. వాటిలో ఒక సూపర్ హిట్ మూవీ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో గ్రామీణ బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది. నగరంలో డాక్టర్ చదువు పూర్తి చేసుకున్న శశి, తన సొంత గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ఈ చిత్రం చూపిస్తుంది. 1940ల నాటి బెంగాల్ పల్లెటూరి వాతావరణాన్ని, అప్పటి ఇళ్లను చాలా సహజంగా చూపించారు ఇందులో. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం వల్ల వచ్చిన కరువు సమయంలో ప్రజలు పడిన కష్టాలు, ఆకలి చావులను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఎక్కడ చూడచ్చు అంటే

ప్రముఖ బెంగాలీ రచయిత మాణిక్ బందోపాధ్యాయ రాసిన క్లాసిక్ నవల ఆధారంగా దర్శకుడు సుమన్ ముఖోపాధ్యాయ ‘పుతుల్ నాచేర్ ఇతికథ’ (Putulnacher Itikatha) అనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది ఆగస్ట్ 1 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నటీనటుల విషయానికొస్తే, అబీర్ ఛటర్జీ తన నటనతో శశి పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇక జయా అహసాన్ కుసుమ్ పాత్రలో అద్భుతమైన హావభావాలు పలికించింది. బెంగాలీ సాహిత్యాన్ని ఇష్టపడే వారికే కాకుండా, సీరియస్ డ్రామా సినిమాలు చూసే వారికి ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అందుకే ఈ సినిమా విడుదలైనప్పుడు విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా Hoichoi, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సిటీలో డాక్టర్ చదువు పూర్తి చేసిన శశి (అబీర్ ఛటర్జీ), తన పల్లెటూరికి తిరిగి వస్తాడు. వస్తూ వస్తూనే ఊళ్ళో ఉన్న మూఢనమ్మకాలు, పాతకాలపు పద్ధతులు చూసి అతనికి చిరాకు పుడుతుంది. తను చదువుకున్న చదువుకి, ఆ ఊరి మనుషుల ఆలోచనలకి ఎక్కడా పొంతన కుదరదు. ఎలాగైనా ఆ ఊరు వదిలేసి మళ్ళీ సిటీకి వెళ్ళిపోవాలని తెగ ప్రయత్నిస్తుంటాడు. కానీ ఏదో ఒక కారణంతో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో, ఊళ్ళో ఉన్న కుసుమ్ (జయా అహసాన్) అనే అమ్మాయితో శశికి ఒక వింతైన బంధం ఏర్పడుతుంది. ఆమె పెళ్లయిన రౌడీ లాంటి భర్తతో కాకుండా, శశి మీద మనసు పడుతుంది.

వీళ్లిద్దరి మధ్య మాటలు, చూపులు నడుస్తున్నా.. సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో శశి తన మనసులోని మాటను బయటపెట్టలేక పోతాడు. అయితే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో, ఊళ్ళో తిండికి కటకట ఏర్పడటం, కలరా లాంటి జబ్బులు రావడం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. దీంతో చివరకు తను కూడా ఆ ఊరి ఊబిలో చిక్కుకుపోతాడు. తను అనుకున్న కలలు కల్లలై, ఆ ఊరిలోనే ఒక కీలుబొమ్మలా మిగిలిపోవడమే ఈ సినిమా అసలు కథ.

Advertisement

Read Also : సీరియల్ కిల్లర్‌కే చుక్కలు చూపించే పిరికోడు… అసలైన కిక్కు ఇచ్చే క్రేజీ సిరీస్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×