E-Paper
Advertisement

OTT Movie : ప్రేమలో గెలవడానికి ఆ పని… వీడు మామూలోడు కాదు

OTT Movie : ప్రేమలో గెలవడానికి ఆ పని… వీడు మామూలోడు కాదు
Advertisement

OTT Movie : ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా, లవ్ స్టోరీ లేకుండా సినిమాలు రావట్లేదు. ప్రతి సినిమాలో ఏదో ఒక లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటోంది. కొత్త కొత్త లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమను గెలవడానికి వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

స్టోరీలోకి వెళితే

Advertisement

శివకుమార్ కాంచీపురంలోని ఒక పేరున్నచేనేత కుటుంబానికి చెందిన యువకుడు. వీళ్ళ పూర్వీకులు ఒకప్పుడు ఆలయాలకోసం, రాజుల కోసం చీరలు నేసే గొప్ప కుటుంబంగా ఖ్యాతిని సంపాదించుకుంటారు. కానీ కాలక్రమేణా ఆ కీర్తి క్షీణించింది. శివకుమార్ తాత వరదరాజన్, ఆ కుటుంబంలో చివరి చేనేత కళాకారుడుగా ఉంటాడు. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతుంటాడు.శివకుమార్ మొదట్లో బాధ్యతారహితంగా, ఉద్యోగం లేకుండా గడుపుతుంటాడు. అతని తండ్రి గణేశన్ అతన్ని చెన్నైలోని తన సోదరుడు మురుగన్ దగ్గరకు పంపిస్తాడు. అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని, వృద్ధిలోకి వస్తాడని అనుకుంటాడు. మురుగన్ బాగా డబ్బున్న వస్త్ర వ్యాపారి గా ఉంటాడు. చంద్రశేఖరన్ అనే సంపన్న కుటుంబానికి, మురుగన్ అల్లుడిగా ఉంటాడు.

అక్కడ శివకుమార్, చంద్రశేఖరన్ మేనకోడలు శ్రుతితో ప్రేమలో పడతాడు. అయితే వరదరాజన్, చంద్రశేఖరన్ మధ్య పాత వైరం ఉంటుంది. ఇది శివకుమార్, శ్రుతి సంబంధానికి అడ్డంకిగా మారుతుంది. అక్కడ అవమానం పడి మళ్ళీ ఇంటికి వస్తాడు శివకుమార్. కొన్ని సంఘటనల తర్వాత, శివకుమార్ చేనేత పరిశ్రమ ప్రాముఖ్యతను, తన కుటుంబం గత వైభవాన్ని గుర్తిస్తాడు. అతను తన తాతతో కలిసి చేనేత కళకు పూర్వ వైభవం తెస్తాడు. చంద్రశేఖరన్ వంటి పెద్ద వస్త్ర వ్యాపారులకు, పోటీ గా మారతాడు. చివరికి శివకుమార్, శ్రుతి లవ్ స్టోరీ ఏమౌతుంది ? వరదరాజన్ తో చంద్రశేఖరన్ కి ఉన్న వైరం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : అడవిలో క్యాంపింగ్ కు వెళ్తున్నారా? ఈ మూవీ చూశాక పొరపాటున కూడా ఆ సాహసం చేయరు

 

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ తమిళ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘శివకుమారిన్ శపథం’ (Sivakumarin Sabadham). 2021లో విడుదలైన ఈ సినిమాకు హిప్హాప్ తమిజా దర్శకత్వం వహించారు. ఇందులో హిప్‌హాప్ ఆది, రాహుల్‌, మాధురీ జైన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ కాంచీపురంలోని ఒక చేనేత కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో ఒక చిన్న చేనేత వ్యాపారాన్ని, ఒక టెక్స్‌టైల్ మాగ్నెట్‌తో పోటీపడే విధంగా తీసుకెళ్తాడు. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×