E-Paper
Advertisement

Dandora OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శివాజీ దండోరా…స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Dandora OTT: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి శివాజీ దండోరా…స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Advertisement

Dandoraa OTT: ఇటీవల కాలంలో గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్నాయి. ఇలా గ్రామీణ కథ నేపథ్యంలో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ తరహా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దండోరా(Dandoraa). మురళి కాంత్ దర్శకత్వంలో శివాజీ(Sivaji) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ విడుదల అయింది. ఇలా గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.

సంక్రాంతి సందర్భంగా దండోరా..

శివాజీ, బిందు మాధవి, నవదీప్, శ్రీ నందు, రవికృష్ణ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా నెలరోజులు తిరగకుండానే తిరిగి ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని జనవరి 14వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అమెజాన్ ప్రైమ్..

Advertisement

గత ఏడాది డిసెంబర్ 25వ తేదీ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదల కానుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే థియేటర్లలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషలలో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో బాగా పాతుకుపోయిన కుల వివక్షత నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అగ్రకులానికి చెందిన శివాజీ (శివాజీ)కు తన కన్న కొడుకు అయిన విష్ణుతో (నందు) మాటలు ఉండవు. శివాజీ అప్పటికే కుల వివక్షతకు గురి అయ్యి ఉంటాడు. ఇక ఆయన చనిపోయిన తన అంత్యక్రియలను స్మశాన వాటికలో నిర్వహించడానికి కూడా కుల పెద్దలు అంగీకరించరు. అగ్రకులానికి చెందిన శివాజీ ఎందుకు కుల వివక్షతకు గురి అయ్యారు? శివాజీకి, శ్రీలత (బిందు మాధవి) కి ఉన్న సంబంధం ఏంటి? తక్కువ జాతి కులానికి చెందిన రవి (రవికృష్ణ) హత్యకు గల కారణాలు ఏంటి ఈ హత్య తర్వాత గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి?అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: Payal Rajputh: ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్… కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×