E-Paper
Advertisement

OTT Movie : ఏం సినిమా సామీ… అరేంజ్డ్ మ్యారేజ్ తో అల్లాడిపోయే పెళ్ళాం… రాత్రైతే చాలు వీధుల్లో

OTT Movie : ఏం సినిమా సామీ… అరేంజ్డ్ మ్యారేజ్ తో అల్లాడిపోయే పెళ్ళాం… రాత్రైతే చాలు వీధుల్లో
Advertisement

OTT Movie : ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ జానర్ సినిమాలకి ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఓటీటీ లో వచ్చే సినిమాలకి సెన్సార్ నిబంధనలు కూడా పెద్దగా లేకపోవడంతో బోల్డ్ సీన్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఇలాంటి సీన్స్ చేయాలంటే రాధిక ఆప్టే తరువాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలలో ఒంటి మీద బట్టలు అస్సలు నిలబడకుండా ఉంటాయి. బోల్డ్ సీన్స్ తో ఈ ఏడాది రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో రచ్చ చేసిన సినిమా ‘సిస్టర్ మిడ్‌నైట్’. ఒక చేతగాని భర్తతో పెళ్లి జరిగాక, ఆ మహిళ ప్రవర్తన చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. రొమాంటిక్ సీన్స్ కారణంగా, ఈ సినిమాని ఒంటరిగా చూస్తేనే మంచిది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘సిస్టర్ మిడ్‌నైట్’ 2024లో విడుదలైన బ్రిటిష్ ఇండియన్ డార్క్ కామెడీ హారర్ మూవీ. కరణ్ కాందహారి దర్శకత్వంలో రాధికా అప్టే (ఉమా) ప్రధాన పాత్రలో, ఆషోక్ పాఠక్ (హస్బెండ్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2024 కాన్స్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఇండియాలో కంటే ముందుగా 2025 మే 16 US/UK లో రిలీజ్ అయింది. ఇండియాలో 2025 మే 30న థియేటర్లలో వచ్చింది. ఈ మూవీ 2024 బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ (BIFA)లో 4 నామినేషన్లు (బెస్ట్ బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ – రాధికా అప్టే) సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, గూగుల్‌ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఉమా (రాధికా ఆప్టే) అనే మహిళకి పెద్దలు కుదిర్చిన వివాహం జరుగుతుంది. ఉమకు ఈ వివాహం ఇష్టం లేకపోయినా, పెద్దల ఒత్తిడితో గోపాల్ అనే వ్యక్తిని చేసుకోవాల్సి వస్తుంది. అతను ముంబైలోని ఒక స్లమ్‌ ఏరియాలో ఆమెని కాపురానికి తీసుకెళ్తాడు. అయితే ఆ ఇళ్ళు చాలా ఇరుగ్గా ఉంటుంది. పక్క గదిలో ఏం మాట్లాడినా వినిపించేంత చిన్నదిగా ఉంటుంది. భర్త కూడా మొద్దు మొహంలా అనిపిస్తాడు. అతనితో సర్దుకుపోలేక కాపురం చేయలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉండదు.

Read Also : పెళ్లి జంటను విడగొట్టే ఫొటోగ్రాఫర్… ఒక్క తప్పుతో గందరగోళం… నవ్వుకోవడానికి మరికొన్ని గంటలే

Advertisement

ఇవన్నీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీంతో ఆమె లోపలున్న కోరికలు బుసలు కొడుతుంటాయి. రాత్రిళ్ళు బయట తిరగడం మొదలు పెడుతుంది. ఓరోజు గోపాల్‌తో ఫిజికల్ గా కలుస్తుంది. ఆ తరువాత అతను చనిపోయి ఉంటాడు. దీంతో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి ఆమె భర్త ఎలా చనిపోయాడు ? ఉమా రాత్రిళ్ళు ఎందుకు బయట తిరుగుతుంది ? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ బ్లాక్ కామెడీ సినిమా చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×