// // Sirai OTT release date : యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన -->
E-Paper
Advertisement

Sirai OTT release date : యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పోలీస్ డ్రామా ‘సిరై’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sirai OTT release date : యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పోలీస్ డ్రామా ‘సిరై’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

Sirai OTT release date : ఓటీటీలోకి మరో తమిళ చిత్రం ఎంట్రీ ఇవ్వబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్ట్‌రూమ్ క్రైమ్ మూవీ థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ తో నడిచింది. ఇది విక్రమ్ ప్రభు కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కింది. సుమారు ₹3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ₹30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయం సాధించింది. పోలీస్ ప్రొసీజరల్ డ్రామా అయిన ఈ సినిమా, ఒక హత్య కేసులో నిందితున్ని కోర్టుకు హాజరుపరచాల్సిన ఒక ఎస్కార్ట్ పోలీసు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ కాబోతోందంటే

విక్రమ్ ప్రభు నటించిన ఈ తమిళ క్రైమ్ డ్రామా మూవీపేరు ‘సిరై’ (Sirai). ఈ చిత్రానికి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 ఓటీటీ ప్లాట్ ఫామ్ పొందింది. జనవరి 23న నుంచి ఈ సినిమా ప్రీమియర్ అవుతుందని ఆ సంస్థ అధికారికంగా కూడా ప్రకటించింది. 2025 డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ, ‘తానక్కారన్’ సినిమాను నిర్మించిన దర్శకుడు తమిజ్ కథ ఆధారంగా రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, ఎల్‌కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్‌కుమార్, అనంత తంబిరాజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులు నుండి కూడా ప్రశంసలు అందుకుంది.

Advertisement

Read Also : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్

స్టోరీ ఏమిటంటే

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ‘కదిరవన్’ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్రను పోషించారు. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని జైలు నుండి శివగంగ కోర్టుకు తరలించే క్రమంలో జరిగే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. హత్య కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న అబ్దుల్ నేపథ్యంలో ఈ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు ఈ అబ్దుల్ ఎవరు ? ఆ హత్య కేసు ఏమిటి ? కదిరవన్ పాత్ర ఇందులో ఎలాంటి మలుపులు తెస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ తమిళ క్రైమ్ డ్రామా సినిమాను మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×