E-Paper
Advertisement

Sing geetham OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్న మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’!

Sing geetham OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్న మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’!
Advertisement

Sing geetham OTT: ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) మరోసారి నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి2898 ఏడి చిత్రాలతో జాతీయస్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇటు నిర్మాతగా కూడా మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అలా ఈయన నిర్మాతగా మారి తీసిన మరో చిత్రం సింగ్ గీతం. మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. 94 సంవత్సరాల వయసులో కూడా నేటితరం ఆడియన్స్ ను మెప్పిస్తూ తీసిన సినిమానే ఇది. మ్యూజికల్ ఫాంటసీ డ్రామాగా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సింగీతం శ్రీనివాసరావును మళ్ళీ దర్శకుడిగా నిలబెట్టింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన సింగ్ గీతం..

అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, అగు స్టాన్లీ, శివ నారాయణ, తులసి, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే థియేటర్లలో మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామా.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి రావడంతో అభిమానులు కాస్త ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

నెల తిరగకుండానే డిజిటల్ ఎంట్రీ..

Advertisement

ఇకపోతే ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 9వ తేదీ నుండి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా మిగతా సౌత్ ఇండియా భాషలైన తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తానికి అయితే థియేటర్లలో బిజీ పనుల వల్ల లేదా షెడ్యూల్ దొరకక సినిమా మిస్ అయినవాళ్లు.. అలాగే సింగీతం శ్రీనివాసరావు మ్యాజిక్ ను మళ్లీ చూడాలనుకునే వాళ్ళు జూలై 9 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఈ మ్యూజికల్ వండర్ ను ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.

also read:బిగ్ బాస్ దశావతారంలో కొత్త రూల్స్.. అలా చేస్తే భారీ జరిమానా!

ఆసక్తిని పెంచిన నాగ్ అశ్విన్..

Advertisement

ఇకపోతే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేశారు నాగ్ అశ్విన్. డిజిటల్ స్ట్రీమింగ్ కి ముందే బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని ఆయన గతంలో వెల్లడించారు. మొత్తానికి అయితే థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షన్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పడంతో ఇటు ఓటీటీ లవర్స్ లో కూడా ఆసక్తి నెలకొనింది. మరి నాగ్ అశ్విన్ ఏ మేరకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారో తెలియాలి అంటే జూలై 9 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×