E-Paper
Advertisement

OTT Movie : పెళ్ళైనోడిని ప్రేమించే సైకో అమ్మాయి… మత్తు ఇచ్చి మంచం మీద… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్

OTT Movie : పెళ్ళైనోడిని ప్రేమించే సైకో అమ్మాయి…  మత్తు ఇచ్చి మంచం మీద… ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు కొదవ లేదు. ఆడియన్స్ కూడా ఇలాంటి జానర్ ని చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కసారి చూస్తే రెండు రోజుల పాటు ఎవర్నీ నమ్మలేకుండా ఉంటాము. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఇది. దీనిని చూస్తున్నప్పుడు, పక్కన ఎవరైనా ఉంటే గట్టిగా హాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతలా హీరోయిన్ యాక్టింగ్ ఇరగదీసింది. ఇందులో నటి మాకరేనా గోమెజ్ కు స్పెయిన్‌లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా దక్కింది. ఒక అమాయకపు సైకో పాత్రలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

2014లో వచ్చిన ఈ స్పానిష్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ష్రూస్ నెస్ట్’. దీనికి జువాన్‌ఫెర్ ఆండ్రేస్ & ఎస్టెబాన్ రోయెల్ డైరెక్టర్స్ గా పనిచేశారు. ఇందులో మాకరేనా గోమెజ్ (మోంట్సె), నాదియా డి సాంటియాగో (చిన్న చెల్లి), హ్యూగో సిల్వా (కార్లోస్) లీడ్ రోల్స్ లో నటించారు. 91 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.7/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, Mubi లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మోంట్సె అనే అమ్మాయి, తన చెల్లిని ఇంట్లోనే ఎక్కువగా బంధించి పెంచుతుంది. తల్లి చనిపోయాక, తండ్రి పారిపోయాక మోంట్సెకి తీవ్రమైన అగోరాఫోబియా (బయటికి రావడం భయం) వచ్చేస్తుంది. ఇంటి బయటకు అడుగు కూడా పెట్టదు, చెల్లిని కూడా బయటికి వెళ్లనివ్వదు. ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఏళ్ల తరబడి బంధీల్లా ఉంటారు. ఒక రోజు పక్క ఫ్లాట్ నుంచి కార్లోస్ అనే అందగాడు గాయపడి వాళ్ల ఇంట్లో పడిపోతాడు. మోంట్సె అతన్ని చూసి ఒక్కసారిగా పిచ్చి ప్రేమలో పడిపోతుంది. ఇతడు నా భర్త అని డిసైడ్ అవుతుంది. అతను కోలుకుని బయటికి వెళ్లాలనుకుంటే… మోంట్సె సైకో మోడ్ ఆన్ అవుతుంది.

Read Also : అపార్ట్మెంట్లో పెళ్ళైన మహిళలంతా అదే పనిలో… ఫ్యామిలీతో పొరపాటున కూడా చూడకూడని సిరీస్

Advertisement

అతన్ని గదిలో బంధిస్తుంది, చైన్‌లు వేస్తుంది, డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తుంది. నువ్వు నా భర్తవి, ఇక్కడినుంచి ఎక్కడికీ వెళ్లొద్దు అని రోజూ టార్చర్ చేస్తుంది. చెల్లి మొదట భయపడుతుంది, తర్వాత తన అక్క పిచ్చి ఎంత లోతులో ఉందో తెలుసుకుని ఎస్కేప్ ప్లాన్ వేస్తుంది. కార్లోస్ భార్యకి అనుమానం వచ్చి వీళ్ళ ఫ్లాట్ కి వస్తుంది. ఆమెను మోంట్సె ఘోరంగా చంపేస్తుంది. చివరి 30 నిమిషాలు ఫుల్ షాకింగ్ ట్విస్ట్లు వుంటాయి. ఎవరు బయటపడతారు? ఎవరు చస్తారు? ఎవరు మరింత సైకో అవుతారు? అనేది లాస్ట్ సీన్ వరకు గుండె ఆగిపోయేలా ఉంటుంది.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×