E-Paper
Advertisement

OTT Movie : ఆస్తి కోసం అడ్డదారులు… ఈగోతో కొంప కొల్లేరు… ఆకట్టుకుంటున్న బెంగాలీ సినిమా

OTT Movie : ఆస్తి కోసం అడ్డదారులు… ఈగోతో కొంప కొల్లేరు… ఆకట్టుకుంటున్న బెంగాలీ సినిమా
Advertisement

OTT Movie : మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి కూడా. ఈ సినిమాలకు ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటాయి ఈ కథలను. అయితే రీసెంట్ గా ఒక బెంగాలీ మూవీ మిడిల్ క్లాస్ నేపథ్యంలో వచ్చింది. తాతల కాలం నాటి ఆస్తి విషయంలో ఇద్దరు తోబుట్టువుల మధ్య తలెత్తిన గొడవల చుట్టూ కథ ఎమోషనల్ గా తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఈ సినిమాకు చాలా మంచి రేటింగ్ కూడా లభించింది. మధ్యతరగతి బంధాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా పేరు ఏమిటంటే

ఈ బెంగాలీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘శార్థోపర్'(Sharthopor) . అంటే స్వార్థపరుడు అని అర్థం వస్తుంది. ఇది 2025 అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది అన్నపూర్ణ బసు దర్శకత్వంలో రూపొందిన మొదటి చిత్రం. సురీందర్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించారు. ఇక అపర్ణ పాత్రలో కోయెల్ మల్లిక్ నటించగా, సౌరవ్ పాత్రలో కౌశిక్ సేన్ నటించారు. ఈ చిత్రానికి జీత్ గంగూలీ సంగీతం అందించారు. IMDbలో దీనికి 8.1/10 రేటింగ్ ఉంది. అయితే ఈ సినిమా ఇంకా ఓటీటీలో అడుగు పెట్టలేదు. Hoichoi ఓటీటీలో తొందరోనే వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అపర్ణ (కోయెల్ మల్లిక్), సౌరవ్ (కౌశిక్ సేన్) అనే అన్నా చెల్లెళ్ళు చిన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా పెరుగుతారు. కానీ పెద్దాయ్యాక వాళ్ళ తాతల కాలం నాటి ఆస్తిని పంచుకునే విషయంలో గొడవలు వస్తాయి. ఇద్దరి మధ్య ఈ వివాదం పెద్ద రచ్చ అవుతుంది. ఈ ఆస్తి తగాదాతో వారిద్దరి మధ్య పంతం బాగా పెరుగుతుంది. ఇది ఒక కుటుంబ పోరాటంగా మారుతుంది. ఈ వివాదం వల్ల ఒకే ఇంట్లో ఉంటూనే ఒకరితో ఒకరు మాట్లాడుకోని స్థితికి వారు చేరుకుంటారు అందరూ.

ఇక వాళ్ళ తండ్రి (రంజిత్ మల్లిక్) తన పిల్లలిద్దరూ పగవాళ్ళలా మారుతుంటే చూసి తల్లడిల్లిపోతుంటాడు. ఆస్తి కోసం మనుషులు ఎంత స్వార్థంగా మారుతారో, ఆ స్వార్థం వల్ల విలువైన రక్తసంబంధాలు ఎలా దెబ్బతింటాయో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చివరికి వాళ్ళు ఆస్తికి విలువ ఇస్తారా ? ఫ్యామిలికి విలువ ఇస్తారా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×