E-Paper
Advertisement

ఈ మూవీని చూశాక అమాయకంగా కన్పించే అమ్మాయిలను అస్సలు నమ్మరు భయ్యా

ఈ మూవీని చూశాక అమాయకంగా కన్పించే అమ్మాయిలను అస్సలు నమ్మరు భయ్యా
Advertisement

Survival Horror Thriller : సర్వైవల్ థ్రిల్లర్లు నిమిషానికో ట్విస్ట్ తో, ఊహించని మలుపులతో ఆకట్టుకుంటాయి. మీరు కూడా అలాంటి ఓ బెస్ట్ లేటెస్ట్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీ మీ కోసమే. సామ్ రైమి దర్శకత్వం వహించిన హాలీవుడ్ సర్వైవల్ హార్రర్ కామెడీ “Send Help”. రాచెల్ మెక్‌ఆడమ్స్, డైలన్ ఓ’బ్రియన్ నటించిన ఈ చిత్రం ఒక సాధారణ ప్లెయిన్ క్రాష్‌ను భయంకరమైన, ఉద్రిక్తమైన సర్వైవల్ స్టోరీగా మార్చేస్తుంది. బ్రూటల్ సీన్స్ ఉన్న ఈ సినిమా JioHotstarలో సంచలనం సృష్టిస్తోంది

కథలోకి వెళ్తే…

లిండా లిడిల్ (రాచెల్ మెక్‌ఆడమ్స్) హార్డ్‌వర్కింగ్, ఇంట్రోవర్టెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఆమె బాస్ బ్రాడ్లీ ప్రెస్టన్ (డైలన్ ఓ’బ్రియన్) చాలా అహంకారి, ఎప్పుడూ లిండాను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక ముఖ్యమైన బిజినెస్ డీల్ కోసం ఇద్దరూ ఒక చిన్న ప్లేన్‌లో ఓ ఐలాండ్‌ కి వెళ్తారు. దీవిలోకి వెళ్తుండగానే ఆ ఫ్లైట్ టెక్నికల్ ఫాల్ట్ వల్ల క్రాష్ అవుతుంది. పైలట్ తో పాటు మిగిలిన వాళ్ళు చనిపోగా… దరిద్రం కొద్ది లిండా – బ్రాడ్లీ మాత్రమే సర్వైవ్ అవుతారు. అలా ఇద్దరూ జనాలు లేని, అడవులతో నిండిన దీవిపైకి చేరుకుంటారు.

Advertisement

మొదట్లో ఒకరినొకరు ఎదిరించడం, సహాయం కోసం సిగ్నల్ పంపడం వంటి విషయాలపైనే ఫోకస్ చేస్తారు. అవేవీ ఫలించకపోవడంతో అక్కడి నుంచి బయట పడే దారిని వెతుకుతారు. బ్రాడ్లీ ఇక్కడ కుడా బాస్ గానే బిహేవ్ చేస్తాడు. లిండాను ఆదేశించడం, లిండా అతన్ని ఎదుర్కోవడం వంటి సంఘటనలతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాదనలు జరుగుతాయి. ఆహారం కోసం, నీటి కోసం, ఆశ్రయం కోసం పోరాడుతూ వారు నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలవుతుంది.

కానీ ఈ దీవి సాధారణమైనది కాదు. రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు, అనుకోని దాడులు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. వారు ఒక పాత, విరిగిపోయిన ఆలయ శిథిలాలను కనుగొంటారు. ఆ దీవికి ప్రాచీన శాపం ఉందని, గతంలో అనేక మంది అక్కడ చిక్కుకుని మరణించారని తెలుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఒక్కొక్క ట్విస్ట్ షాక్ ఇస్తాయి. లిండా సీక్రెట్ గతం బయట పడుతుంది. బ్రాడ్లీ కూడా తన నిజ స్వభావాన్ని చూపిస్తాడు. చివరి 30 నిమిషాలు ఇంటెన్స్ గా, భయపెట్టేస్తూ సాగుతాయి. మరి వీరిద్దరూ ఆ దీవి నుంచి ఎలా బయట పడ్డారు ? చివరికి ఏమైంది ? అన్నది స్టోరీ.

ఎక్కడ చూడవచ్చు ?

Advertisement

సామ్ రైమి స్టైల్‌లో డార్క్ హ్యూమర్, తీవ్రమైన సస్పెన్స్, ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. రాచెల్ మెక్‌ఆడమ్స్, డైలన్ ఓ’బ్రియన్ నటన సినిమాకు బలం. “సెండ్ హెల్ప్” JioHotstarలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హార్రర్, సర్వైవల్, థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లు మస్ట్ వాచ్.

Read Also : ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×