E-Paper
Advertisement

ఓటీటీలోకి సెల్వ రాఘవన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి సెల్వ రాఘవన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

OTT Movies: ప్రస్తుతకాలంలో తెరకెక్కే చిన్న సినిమాలు ఎక్కువగా యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. వీటికి బడ్జెట్ తక్కువే కానీ వీటికి ప్రేక్షక ఆదరణ చూస్తే మాత్రం మతిపోతుంది. అందుకే చిన్న సినిమాలుగా వచ్చినా ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో సత్తా చాటుతూ బ్లాక్ బాస్టర్లుగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఉంటే తారాగణంతో పనిలేదని నిరూపిస్తున్నాయి కూడా.. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోగా నటించిన ఒక రియల్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ఐఎండిబి లో ఏకంగా తొమ్మిది రేటింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాను మాత్రం అసలు మిస్ అవ్వకండి అంటూ థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ సినిమా ఏంటి? దాని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మణిదన్ దైవమంగళం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్..

ప్రముఖ డైరెక్టర్ డెనిస్ మంజునాథ్ దర్శకత్వంలో సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మణిదన్ దైవమంగళం’. ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. ఒక సామాన్యుడు వ్యవస్థలోని లోపాలను.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడే స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే ఎదురయ్యే పరిణామాలను ళ్ళకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా సెన్సిటివ్ అంశాలైన మహిళలపై వేధింపులు, అధికార దుర్వినియోగం వంటి విషయాలను డైరెక్టర్ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. అలాంటి ఈ సినిమా మే ఒకటవ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్స్ట్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

also read:ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!

తెలుగులో కూడా..

ఇక ప్రముఖ కన్నడ నటి ఖుషీ రవి హీరోయిన్ గా నటించగా.. మైమ్ గోపి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ సెల్వ రాఘవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇప్పటికే IMDB లో 9 రేటింగ్స్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న ఈ సినిమా ఇటు ఓటిటిలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మణిదన్ దైవమంగళం సినిమా స్టోరీ..

Advertisement

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఊరిలో వడ్డీ వ్యాపారి ఇన్బరాజు అప్పు తీసుకున్న మహిళలను లైంగికంగా వేధిస్తూ అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే హీరో కుటుంబం కూడా ఈ సమస్యల సుడిగుండంలో పడుతుంది. అన్యాయాన్ని సహించలేని హీరో స్థానిక ఎమ్మెల్యేను నిలదీయడంతో వారి మధ్య గొడవలు మొదలవుతాయి. తన పరువు తీసిన హీరోపై ఎమ్మెల్యే పగ పెంచుకోవడంతో హీరో కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది ఈ సినిమాలో ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఈ రస్టిక్ డ్రామాలో సెల్వ రాఘవన్ చాలా అద్భుతంగా నటించారు. దర్శకుడిగా సత్తా చాటిన సెల్వరాఘవన్ ఇటు నటుడిగా కూడా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×