E-Paper
Advertisement

ఫ్యూచర్ ని ముందే ఊహించే టెక్నాలజీ… అస్సలు మిస్ అవ్వకూడని మిస్టరీ సిరీస్

ఫ్యూచర్ ని ముందే ఊహించే టెక్నాలజీ… అస్సలు మిస్ అవ్వకూడని మిస్టరీ సిరీస్
Advertisement

Science fiction thriller series : ఓటీటీలో ఒక మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ లో ఉంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది ఒక పెద్ద టెక్ కంపెనీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మర్డర్ మిస్టరీ లాగా మొదలవుతుంది. అయితే కథ నడిచే కొద్దీ అసలు కథ వేరే లెవెల్‌కి వెళ్తుంది. ఇక్కడ ఫ్యూచర్ ని ముందే ఊహించే టెక్నాలజీతోనే కథ నాదస్తునది.  చాలా ఇంట్రెస్టింగ్‌గా అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లే డిఫరెంట్ సిరీస్ ఇది. ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ప్రతి సీన్ ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ మినీ సిరీస్ పేరు Devs (డేవ్స్). దీనిని ప్రముఖ దర్శకుడు అలెక్స్ గార్లాండ్ రూపొందించారు. ఈ సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా హాలీవుడ్‌లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. దర్శకుడు అలెక్స్ గార్లాండ్ ఈ సిరీస్ కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ క్యాంపస్‌ను ‘అమాయ’ కంపెనీగా చూపించారు. అక్కడ ఉన్న దట్టమైన రెడ్‌వుడ్ చెట్లు కథలోని ఇంటెన్స్ ను పెంచాయి. దీనికి తోడు బెన్ సాలిస్‌బరీ, జియోఫ్ బారో అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌లోనూ హై-టెన్షన్ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మినీ సిరీస్ 72వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులలో సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో మొత్తం 4 నామినేషన్లను దక్కించుకుంది. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ సిరీస్ ఐఎండిబిలో 7.6/10 రేటింగ్‌తో టాప్ సైన్స్ ఫిక్షన్ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో దీన్ని చూడచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ స్టోరీ ‘Amaya’ అనే ఒక పెద్ద టెక్ కంపెనీ చుట్టూ తిరుగుతుంది. ఈ కంపెనీలో లిల్లీ చాన్, ఆమె ప్రియుడు సెర్గీ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తుంటారు. సెర్గీ టాలెంట్ చూసి కంపెనీ సీఈఓ ఫారెస్ట్, అతన్ని ఎవరికీ తెలియని అత్యంత రహస్యమైన ‘Devs’ అనే విభాగానికి ప్రమోట్ చేస్తాడు. అయితే ఆ విభాగానికి వెళ్లిన మొదటి రోజే సెర్గీ అనుమానాస్పదంగా మాయమైపోతాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని కంపెనీ వాళ్లు ఒక సిసిటివి ఫుటేజ్ చూపిస్తారు. కానీ అందులో ఏదో తేడా ఉందని గ్రహించిన లిల్లీ, తన ప్రియుడి చావు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలాగైనా బయటపెట్టాలని తన మాజీ ప్రియుడు జామీ సహాయంతో సీక్రెట్‌గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది.

లిల్లీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆ కంపెనీ భయంకరమైన రహస్యాలు బయటపడతాయి. అక్కడ ఫారెస్ట్, కేటీ అనే ఇద్దరు కలిసి ఒక పవర్‌ఫుల్ క్వాంటం సూపర్ కంప్యూటర్‌ను తయారు చేస్తారు. ఈ కంప్యూటర్ సాయంతో గతాన్ని, అలాగే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా స్క్రీన్‌పై స్పష్టంగా చూడవచ్చు. మనుషులకి స్వేచ్ఛా అనేది ఉండదని, అంతా ముందే రాసిపెట్టినట్టు జరుగుతుందని వాళ్లు నమ్ముతారు. ఆ కంప్యూటర్ లెక్కల ప్రకారం లిల్లీ ఫ్యూచర్‌లో చేసే ఒక పని వల్ల ప్రపంచం మొత్తం మారిపోతుందని వాళ్లకు తెలుస్తుంది. అసలు సెర్గీని ఎందుకు చంపారు ? ఆ కంప్యూటర్ చూపించిన భవిష్యత్తును లిల్లీ మార్చగలిగిందా ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : తల్లి కోసం ఒక్కటయ్యే అక్కాచెల్లెళ్ళు… ఓటీటీలోకి వచ్చేసిన మరాఠీ ఫ్యామిలీ డ్రామా… ఐయండిబిలో 8.5 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×