E-Paper
Advertisement

థియేటర్లలో చరిత్ర సృష్టించిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు… వీటిలో మీరెన్ని చూసారు ?

థియేటర్లలో చరిత్ర సృష్టించిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు… వీటిలో మీరెన్ని చూసారు ?
Advertisement

Science fiction thriller movies on OTT : సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఊహల ప్రపంచం కూడా. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎక్కువగా ఊహాల్లోనే వస్తుంటాయి. సినీ ప్రపంచ మొదలైనప్పటి నుంచి ఈ జానర్ సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. మనిషి ఊహకు అందని అద్భుతాలను తెరపై తీసుకొచ్చారు మేకర్స్. దశాబ్దాల క్రితంమే టెక్నాలజీతో వెండితెరపై మాయాజాలం సృష్టించారు దర్శకులు. అప్పట్లో థియేటర్లలో కాసులు కురిపించడమే కాకుండా, నేటికీ టెక్నాలజీకి పాఠాలు నేర్పుతున్న ఐదు క్లాసిక్ సినిమాల గురించి తెలుసుకుందాం.

1. స్టార్ వార్స్: ఏ న్యూ హోప్ (1977)

అంతరిక్షం అంటే కేవలం నక్షత్రాలు మాత్రమే కాదు, అక్కడ కూడా యుద్ధాలు, రాజ్యాలు ఉంటాయని చూపించిన సినిమా ఇది. జార్జ్ లూకాస్ సృష్టించిన ఈ ప్రపంచం అప్పట్లో ఒక సంచలనం. ఆకాశంలో లైట్ సేబర్స్ పట్టుకుని పోరాడే దృశ్యాలు చూసి జనం స్టన్ అయిపోయారు. నేటికీ స్పేస్ సినిమాలకు ఇదే పునాది. ఇది ప్రస్తుతం Jio Hotstar లో అందుబాటులో ఉంది.

2. ఏలియన్ (1979)

Advertisement

సైన్స్ ఫిక్షన్‌కు భయాన్ని జోడిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. స్పేస్ షిప్ లో ఒక వింత జీవి ప్రవేశించి చేసే అల్లకల్లోలం ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది. రిడ్లీ స్కాట్ మేకింగ్, ఆ ఏలియన్ డిజైన్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. సైన్స్ ఫిక్షన్ హారర్ జానర్‌లో ఇదొక లెజెండరీ మూవీ. దీనిని మీరు Jio Hotstar లో చూడొచ్చు.

3. బ్యాక్ టు ది ఫ్యూచర్ (1985)

మనం గతంలోకి వెళ్లి మన తల్లిదండ్రుల పెళ్లి ఆపేస్తే ఏమవుతుంది?” అనే క్రేజీ పాయింట్‌తో వచ్చిన సినిమా ఇది. టైమ్ ట్రావెల్ సినిమాల్లో దీనికి సాటి వచ్చేది లేదు. ఒక కారుని టైమ్ మెషీన్‌గా మార్చి చేసిన సాహసాలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. అప్పట్లో ఈ సినిమా యువతను ఉర్రూతలూగించింది. ఇది Netflix, Amazon Prime Video లో స్ట్రీమ్ అవుతోంది.

4. టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే (1991)

Advertisement

రోబోలు మానవజాతిపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? అనే కథతో వచ్చిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అబ్బురపరచింది. లిక్విడ్ మెటల్‌తో తయారైన రోబో రూపం మార్చుకునే సీన్స్ చూసి అప్పట్లో అందరూ నోరెళ్లబెట్టారు. జేమ్స్ కెమెరాన్ విజన్, ఆర్నాల్డ్ యాక్షన్ ఈ సినిమాని ఆల్-టైమ్ గ్రేట్ యాక్షన్ మూవీగా నిలబెట్టాయి. ఇది Lionsgate Play, Prime Video లో లభిస్తుంది.

5. జురాసిక్ పార్క్ (1993)

కోట్ల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసార్లను స్టీవెన్ స్పీల్‌బర్గ్ మళ్లీ బ్రతికించారు. డైనోసార్లు అరుస్తున్నప్పుడు థియేటర్లో సీట్లు దడదడలాడాయి. అప్పట్లో సిజిఐ టెక్నాలజీని వాడుతూనే, యానిమేట్రానిక్స్ తో డైనోసార్లను కళ్ళకు కట్టినట్లు చూపించారు. నేటికీ ఆ గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఈ వండర్‌ని మీరు Netflix, Prime Video లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Read Also : ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్… మాఫియా సామ్రాజ్యాన్ని వల్లకాడు చేసే కిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×