E-Paper
Advertisement

తోక చుక్క తెచ్చిన తంట.. ఫిజిక్స్ కాన్సెప్ట్ తో మైండ్ బెండ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

తోక చుక్క తెచ్చిన తంట.. ఫిజిక్స్ కాన్సెప్ట్ తో మైండ్ బెండ్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
Advertisement

Science Fiction Movie OTT ఫిజిక్స్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన ఒక మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అబ్బురపరుస్తోంది. కేవలం ఒకే ఒక్క ఇంట్లో, ఒక రాత్రి జరిగే డిన్నర్ పార్టీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ఎలాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం అద్భుతమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన సంభాషణలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తోకచుక్క ప్రభావం వల్ల వేర్వేరు డైమెన్షన్లు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు మనుషుల్లో పుట్టే గందరగోళం, భయాన్ని ఈ సినిమా అత్యంత క్లాస్ట్రోఫోబిక్ శైలిలో చూపిస్తుంది. సినిమా ముగిసే వరకు “ఇప్పుడు స్క్రీన్‌పై ఉన్నది అసలు మనుషులా లేక వేరే ప్రపంచం నుండి వచ్చిన వాళ్ళా అని ప్రేక్షకుడు నిరంతరం ఆలోచించేలా చేసే ఒక పజిల్ లాంటి అరుదైన చిత్రమిది.

ఎక్కడ చూడచ్చు అంటే

హాలీవుడ్‌లో అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది ‘కోహెరెన్స్’ (Coherence). ఈ చిత్రం కేవలం $50,000 (సుమారు ₹41 లక్షలు) బడ్జెట్‌తో, దర్శకుడు జేమ్స్ వార్డ్ బైర్కిట్ తన స్వంత లివింగ్ రూమ్‌లోనే కేవలం ఐదు రాత్రులలో షూటింగ్‌ను పూర్తి చేశారు. 88% రాటెన్ టొమాటోస్ రేటింగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా $1.3 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించి పెట్టింది ఈ మూవీ. ఈ సినిమా క్వాంటం మెకానిక్స్ అనే భౌతికశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది. తోకచుక్క ప్రభావం వల్ల ఒకే సమయంలో అనంతమైన సమాంతర విశ్వాలు (Parallel Universes) ఒకదానితో ఒకటి ఎలా లింకు అవుతాయో దర్శకుడు ఇందులో ఒక పజిల్ లాగా చూపించారు. ఈ మైండ్-బెండింగ్ కథాంశం, అద్భుతమైన స్క్రీన్‌ప్లే కారణంగా సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ఉత్తమ స్క్రీన్‌ప్లే” అవార్డుతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఇదొక క్లాసిక్ కల్ట్ చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ సినిమా peacock, Plex ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ ఎనిమిది మంది స్నేహితులు ఒక రాత్రి డిన్నర్ పార్టీ కోసం ఒక ఇంట్లో కలవడంతో ప్రారంభమవుతుంది. సరిగ్గా అదే రాత్రి ‘మిల్లర్స్ కామెట్’ అనే తోకచుక్క భూమికి అత్యంత సమీపం నుండి ప్రయాణిస్తుంది. పార్టీ జరుగుతుండగా హఠాత్తుగా అందరి మొబైల్ స్క్రీన్‌లు పగిలిపోయి, ఆ ప్రాంతం మొత్తం కరెంట్ పోతుంది. చీకట్లో ఉన్న వారికి పక్క వీధిలో వెలుగుతున్న ఒకే ఒక్క ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి నుండి సహాయం పొందాలని కొందరు స్నేహితులు బయటకు వెళ్లడంతో అసలు కథ మలుపు తిరుగుతుంది.

బయటకు వెళ్లిన వారు తిరిగి వచ్చిన తర్వాత, పక్క వీధిలోని ఇంట్లో కూడా సరిగ్గా తమలాగే ఉన్న మరో ఎనిమిది మంది స్నేహితుల గుంపు ఉందని గ్రహిస్తారు. తోకచుక్క ప్రభావం వల్ల క్వాంటం భౌతికశాస్త్ర నియమాలు మారిపోయి, సమాంతర విశ్వాలు (Parallel Universes) ఒకదానితో ఒకటి కలిసిపోయాయని వారికి అర్థమవుతుంది. స్నేహితులు బయట ఉన్న చీకటి జోన్‌లోకి వెళ్లిన ప్రతిసారీ, వారు తెలియకుండానే వేరే డైమెన్షన్‌లోకి ప్రవేశిస్తుంటారు. దీనివల్ల కొద్దిసేపటికే ఆ ఇంట్లో ఉన్నవారు తమ అసలు స్నేహితులా లేక వేరే ప్రపంచం నుండి వచ్చిన వాళ్ళా అనేది ఎవరికీ అర్థం కాక తీవ్రమైన గందరగోళం, అనుమానం మొదలవుతాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఊళ్ళో చర్మం లేకుండా పుట్టే పిల్లలు… తల్లిదండ్రులే చంపి ఇదేం దారుణం భయ్యా ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×