E-Paper
Advertisement

ఆయుష్షును దొంగిలించే రాక్షసుడు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ రేంజ్ లో అదరగొడుతున్న సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్

ఆయుష్షును దొంగిలించే రాక్షసుడు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ రేంజ్ లో అదరగొడుతున్న సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Science fiction Series on OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో కామెడీ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది పెద్దవాళ్ల కోసం తీసిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ లాంటిది. కాకపోతే ఇక్కడ దెయ్యాలతో ఫైట్ చేసేది చిన్న పిల్లలు కాదు, రిటైర్ అయిపోయిన ముసలివాళ్ల బ్యాచ్. ఒక పక్క హారర్ సీన్లతో ఒళ్లు గగుర్పొడుస్తూనే, ఇంకోవైపు ముసలి వాళ్ళ బాధలను కామెడితోనే మనసును కదిలించేలా తీశారు. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ లో కూడా ఉంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ పేరు ‘ది బరోస్’ (The Boroughs). ఈ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒరిజినల్ సిరీస్ 2026 మే 21 నుంచి (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీని వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్ సృష్టికర్తలు డఫర్ బ్రదర్సే ఈ కథను నమ్మి పైసలు పెట్టి నిర్మించారు. జెఫ్రీ అడిస్, విల్ మాథ్యూస్ అనే ఇద్దరు కిర్రాక్ రైటర్లు ఈ కథను రాశారు. ఇక నటీనటుల విషయానికొస్తే హాలీవుడ్ సీనియర్ తోపులంతా ఇందులో దిగారు. ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలో విలన్ డాక్టర్ ఆక్టోపస్‌గా చేసిన ఆల్ఫ్రెడ్ మోలినా ఇందులో సామ్ కూపర్‌గా మెయిన్ రోల్ చేయగా.. గీనా డేవిస్, ఆల్ఫ్రే వుడార్డ్, బిల్ పుల్‌మన్ లాంటి గట్టి సీనియర్ బ్యాచ్ అంతా ఆ ముసలి గ్యాంగ్‌లో యాక్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనే ఈ రోజే విడుదలైన ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కోటి దాదాపు గంట సేపు ఉంటుంది. ఇది ఇంగ్లీషుతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సిరీస్ కథ అంతా న్యూ మెక్సికో ఎడారిలో ఉండే ఒక రిటైర్మెంట్ హోమ్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన ముసలివాళ్లు ఉంటారు. ఇందులో కథానాయకుడు సామ్ కూపర్ అనే రిటైర్డ్ ఇంజనీర్ తన భార్య చనిపోయాక ఒంటరిగా ఈ కాలనీకి వస్తాడు. అయితే ఒక రాత్రి ఇక్కడ కాలనీ సందుల్లో తిరుగుతున్న ఒక వింతైన, భయంకరమైన రాక్షసుడిని చూస్తాడు. వయసైపోయి పిచ్చెక్కి ఏదేదో మాట్లాడుతున్నాడని మేనేజ్‌మెంట్ వాళ్లు సామ్ మాటల్ని నమ్మరు. దాంతో సామ్ ఎలాగైనా ఆ నిజాన్ని నిరూపించాలని, ఆ కాలనీలో ఉండే ఇంకొందరు ముసలివాళ్లను తోడు తెచ్చుకుని ఒక గ్యాంగ్‌గా తయారు చేస్తాడు.

ఆ రాక్షసి అక్కడి వృద్ధుల ప్రాణాలను, వాళ్లకున్న కొద్దిపాటి సమయాన్ని దొంగిలించడానికి వచ్చిందని ఆ ముసలివాళ్ల గ్యాంగ్‌కు అర్థమవుతుంది. ఇంకేముంది.. లాఠీలు, కర్రలు వేసుకుని ఆ వృద్ధులంతా ఆ రాక్షసుడిపై యుద్ధానికి దిగుతారు. చివరికి ఆ ముసలివాళ్లంతా కలిసి ఆ వింత శక్తులను ఎలా ఎదుర్కొన్నారు ? తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సిరీస్ అసలు కథ.

Advertisement

Read Also : బెర్లిన్ లో బురిడీ కొట్టించే గ్యాంగ్… మనీ హీస్ట్ లాంటి మైండ్ బెండింగ్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×