E-Paper
Advertisement

Sci-fi horror movie OTT: భూమి మీద ప్రాణాలు తీసే ఏలియన్లు… సైలెంట్ గా వైలెన్స్ చూపించే హారర్ స్టోరీ

Sci-fi horror movie OTT: భూమి మీద ప్రాణాలు తీసే ఏలియన్లు… సైలెంట్ గా వైలెన్స్ చూపించే హారర్ స్టోరీ
Advertisement

Sci-fi horror movie OTT : ఒక సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భూమి మీద ఎలియన్స్ లాంటి వింత జీవులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి ఇందులో. శబ్దం ఎక్కడ వచ్చినా ఈ జీవులు భయంకరంగా వేటాడుతుంటాయి. ఒక్కో సీన్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో పక్కాగా ఉంచుతుంది. ఐయండిబిలో ఈ సినిమాకు ఏడుకు పైగా రేటింగ్ కూడా ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ II’ . జాన్ క్రాసిన్సికి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎమిలీ బ్లంట్, సిలియన్ మర్ఫీ, మిల్లిసెంట్ సిమ్మండ్స్, నోహ్ జూప్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2018 లో వచ్చిన ‘ఏ క్వైట్ ప్లేస్’ కు సీక్వెల్. ఈ సినిమా 2021 మేలో థియేటర్లలో విడుదలైంది. సుమారు $61 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $297 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాను Netflix, Amazon Prime Video, Apple TV ప్లాట్‌ ఫామ్‌లలో చూడవచ్చు. ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 3’ 2027లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

కథ ఏమిటంటే

Advertisement

మొదటి భాగంలో తండ్రిని కోల్పోయిన అబాట్ కుటుంబం, తమ పొలాన్ని వదిలి సురక్షితమైన ప్రాంతం కోసం ప్రయాణం మొదలుపెడతారు. శబ్దాన్ని బట్టి వేటాడే భయంకరమైన వింత జీవుల నుండి తప్పించుకుంటూ వెళ్తుండగా, వాళ్ళకి ఎమ్మెట్ అనే పాత పరిచయస్తుడు కనిపిస్తాడు. మొదట అతను వాళ్ళకి సహాయం చేయడానికి నిరాకరించినా, ఆ తర్వాత వాళ్ల పరిస్థితి చూసి తన బంకర్‌లోకి రానిస్తాడు. అయితే ఇంతలోనే తమ దగ్గర ఉన్న ఒక యంత్రం ద్వారా ఆ రాక్షస జీవులను చంపవచ్చని తెలుసుకున్న కూతురు రీగన్, ఆ రహస్యాన్ని మిగతా వాళ్ళకి తెలియజేయాలని ఒంటరిగా బయలుదేరుతుంది.

రీగన్ కోసం వెతుకుతూ ఆమె వెంటే వెళ్లిన ఎమ్మెట్, చివరికి ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది మనుషులు శబ్దం చేసినా భయం లేకుండా ప్రశాంతంగా జీవించడం చూస్తారు. ఎందుకంటే ఆ రాక్షస జీవులకు ఈత రాదు. అందుకే నీటి మధ్యలో ఉన్న ఆ ద్వీపానికి అవి రాలేవు. కానీ అనుకోకుండా ఒక జీవి పడవలో ఆ ద్వీపానికి చేరుకుని అక్కడ ఉన్న వాళ్ళపై కూడా దాడి చేస్తుంది. ఆ సమయంలో రీగన్ తన దగ్గర ఉన్న యంత్రంతో ఆ జీవులను ఎదుర్కొంటుంది. చివరికి ఆ వింత జంతువుల నుంచి ఆ ఫ్యామిలీ ప్రాణాలతో బయట పడుతుందా ? అసలు ఆ యంత్రంతో వాటిని చంపొచ్చా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×