E-Paper
Advertisement

మనిషి మెదడును జంతువు శరీరంలోకి బదిలీ… హార్ట్ టచింగ్ కామెడీ సై-ఫై థ్రిల్లర్

మనిషి మెదడును జంతువు శరీరంలోకి బదిలీ… హార్ట్ టచింగ్ కామెడీ సై-ఫై థ్రిల్లర్
Advertisement

Sci-fi Animated Comedy movie: ప్రపంచంలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో మనిషికి సంబంధించిన అన్నీ ఆర్గాన్ ల మీద ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ ఒక మనిషి మెదడును జంతువులోకి బదిలీ చేస్తే ఏం జరుగుతుంది ? అసలు అది ఎలా సాధ్యం ? అన్నది తెలియాలంటే ఈ యానిమేటెడ్ మూవీని చూడాల్సిందే. డిస్నీ-పిక్సార్ స్టూడియోలు తెరకెక్కించిన క్రేజీ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ హాపర్స్ (Hoppers). 2026లో డేనియల్ చాంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రకృతి రక్షణ, స్నేహం, ధైర్యం గురించి అద్భుతమైన సందేశంతో వచ్చింది.

కథలోకి వెళ్తే…

బీవర్ శరీరంలోకి వెళ్లిన అమ్మాయి జంతువులా మారి ప్రకృతిని కాపాడడానికి చేసే తిరుగుబాటు ఈ సినిమా కథ. ఒక చిన్న పట్టణం ‘బీవర్టన్’, ఆ చుట్టుపక్కల ఉన్న అడవి, చెరువు ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది స్టోరీ మొత్తం. ఇక్కడి ప్రకృతి అందాలు, జంతువుల జీవన విధానం చాలా అందంగా చూపించారు. ఇక మన హీరోయిన్ ప్రకృతి ప్రేమికురాలు మేబల్. 19 ఏళ్ల యువతి మేబల్ తనాకా. ఆమెకు చిన్నప్పటి నుంచి జంతువులు, అడవులు, ప్రకృతి అంటే ప్రాణం.

Advertisement

ఆమె బీవర్టన్ చెరువు ప్రాంతంలో గడపడం, జంతువులతో మాట్లాడడం చాలా సాధారణం. కానీ దురాశపరుడైన మేయర్ వల్ల ఆ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. బీవర్టన్ మేయర్ జెర్రీ జెనెరాజ్జో స్వార్థపరుడు. అతను ఆ చెరువు ప్రాంతాన్ని పూడ్చి, అక్కడ ఒక భారీ హైవే, షాపింగ్ మాల్ నిర్మించాలని ప్లాన్ చేస్తాడు. దీనివల్ల ఎన్నో జంతువులు తమ ఆవాసాలను కోల్పోతాయి. మేబల్ ఈ ప్లాన్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం వినూత్న టెక్నాలజీని వాడుతుంది.

సరిగ్గా అదే సమయంలో శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరికరాన్ని కనుగొంటారు. దీని ద్వారా మనుషుల ఆలోచనలను జంతువుల రోబోటిక్ శరీరాల్లోకి బదిలీ చేయవచ్చు. మేబల్ ఈ టెక్నాలజీని ఉపయోగించి తన మైండ్‌ను ‘లాఫ్’ అనే బీవర్ రోబోటిక్ శరీరంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె ఒక బీవర్‌గా జంతువుల ప్రపంచంలోకి వెళ్తుంది. బీవర్ రూపంలో ఉన్న మేబల్‌కు అక్కడ ఎన్నో కొత్త స్నేహాలు ఏర్పడతాయి.

Advertisement

‘కింగ్ జార్జ్’ అనే అల్లరి బీవర్ ఆమెకు దగ్గర స్నేహితుడవుతాడు. జంతువుల ఆవాసాలు నాశనం అవుతున్న విషయం తెలిసి, మేబల్ వాటన్నింటినీ ఏకం చేసి మేయర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె జంతువుల భాష, వారి సమస్యలు, వారి స్నేహం గురించి నేర్చుకుంటుంది. మరి మేబల్, ఆమె జంతువుల స్నేహితులు కలిసి మేయర్ ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టారు ? ప్రకృతిని, జంతువుల ఆవాసాలను ఎలా కాపాడారు ? అనే ఉత్కంఠభరితమైన స్టోరీనే ఈ మూవీ. ‘హాపర్స్’ జూన్ 3 నుంచి Hotstarలో హిందీ, ఇంగ్లీష్ ఆడియోలతో అందుబాటులో ఉంది. పిల్లలతో కలిసి ఈ వీకెండ్ చూడడం మర్చిపోకండి.

Read Also: మనుషుల్ని పిశాచాలుగా మార్చే వైరస్… కొరియన్ అపోకలిప్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×