E-Paper
Advertisement

OTT Movie : ఏడు ఆస్కార్లు గెలిచిన రియల్ స్టోరీ… హిట్లర్ దాష్టీకం నుంచి 1100 మందిని బతికించిన హీరో… ఇప్పటికీ టాప్ 10లో చోటు

OTT Movie : ఏడు ఆస్కార్లు గెలిచిన రియల్ స్టోరీ… హిట్లర్ దాష్టీకం నుంచి 1100 మందిని బతికించిన హీరో… ఇప్పటికీ టాప్ 10లో చోటు
Advertisement

OTT Movie : హిట్లర్ రెండో ప్రపంచ యుద్దానికి ఒక కేంద్ర బిందువుగా నిలిచాడు. కొన్ని లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసాడు. అతని చరిత్ర చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు. అయితే ఆ సమయంలో నడిచే ఒక రియల్ పాత్రను దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమా రూపంలో తెరకెక్కించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు మారన హోమం సృష్టిస్తున్న సమయంలో ఒక జర్మన్ బిజినెస్‌మెన్ ఓస్కార్ షిండ్లర్ అనే వ్యక్తి, 1,100 మంది యూదుల ప్రాణాలు ఎలా కాపాడాడో ఈ స్టోరీ చూపిస్తుంది. ఈ సినిమా పూర్తిగా బ్లాక్ & వైట్ లో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క చిన్న రెడ్ కలర్ సీన్ మాత్రమే ఇందులో ఉంది. ఈ సినిమా 1994 ఆస్కార్‌ల్లో 7 విభాగాల్లో గెలిచింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్కోర్, ఆర్ట్ డైరెక్షన్ లో ఈ ఘనత సాధించింది. ఇప్పటికీ చాలా మంది చరిత్రలోనే అతి గొప్ప సినిమాగా దీనిని కీర్తిస్తుంటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

స్టోరీ ఏమిటంటే

స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఈ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సినిమా పేరు ‘షిండ్లర్స్ లిస్ట్’ (Schindler’s List). ఇందులో ఓస్కార్ షిండ్లర్ పాత్రలో లియామ్ నీసన్ పోషించారు. 1993లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఐయండిబిలో 9/10 టాప్ రేటింగ్ పొందింది. చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన అత్యంత గొప్ప చిత్రాలలో ఈ సినిమా ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం prime video, Jio hotstar లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : సూర్యుడు అస్తమించని గ్రామంలో తెల్లార్లు నరకం చూపించే దెయ్యాలు… కళ్లముందే కనికట్టు మంత్రాలు

స్టోరీ ఏమిటంటే

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో షిండ్లర్ అనే జర్మన్ బిజినెస్‌మెన్ హిట్లర్ నాజీ పార్టీ మెంబర్ గా ఉంటాడు. అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. హిట్లర్ యూదుల్ని డెత్ క్యాంపుల్లో పడేస్తున్న సమయంలో షిండ్లర్ ఒక ఫ్యాక్టరీ కొంటాడు. అక్కడ స్టీల్ పాత్రలు, ప్లేట్లు తయారు చేయాలని అనుకుంటాడు. దానికి చౌకగా లేబర్ ని తెప్పించేందుకు ఒక నాజీ ఆఫీసర్ సాయంతో వందల మంది యూదుల్ని ఫ్యాక్టరీలో పని చేయించుకుంటాడు. మొదట్లో అతనికి కేవలం డబ్బు మాత్రమే టార్గెట్ ఉంటుంది. కానీ క్రమంగా ఫ్యాక్టరీలో పని చేసే యూదులతో ముఖ్యంగా అతని అకౌంటెంట్ తో కలిసి ఉండడంతో అతని మనసు మారుతుంది. గ్యాస్ చాంబర్లకు పంపబోతున్న యూదుల్ని తన ఫ్యాకరిలో పని చేయాల్సిందిగా చెప్పి ఒక్కొక్కరిని రక్షిస్తాడు. దానికి అతను మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెడతాడు. యుద్ధం ముగిసే సమయానికి అతను పేదవాడిగా మిగులుతాడు. కానీ 1,100 మంది మనుషుల ప్రాణాలు కాపాడతాడు. సినిమా చూస్తుంటే ఒక్కసారి కూడా కళ్లు తిప్పుకోలేం. గ్యాస్ చాంబర్ సీన్స చూస్తే థియేటర్ మొత్తం కంటతడి పెట్టుకుంటుంది.

Advertisement

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×