E-Paper
Advertisement

OTT Movie : భర్తతో ఏకాంతంగా గడపనివ్వని ఆత్మ… మరొకరితోనే అలా చేయాలని కండిషన్…

OTT Movie : భర్తతో ఏకాంతంగా గడపనివ్వని ఆత్మ… మరొకరితోనే అలా చేయాలని కండిషన్…
Advertisement

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చివరి వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సస్పెన్స్ తో సాగిపోయే ఈ సినిమాలను, ప్రేక్షకులు కూడా కుర్చీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ లోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది మానసిక ప్రాబ్లమా లేదా ఆత్మ ప్రవేశించిందా అనే కన్ఫ్యూజన్లో పడతాడు ఆమె భర్త. ఈ మూవీని చూస్తే కొన్ని సన్నివేశాలు రజినీకాంత్ నటించిన సినిమా చంద్రముఖిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జి ఫైవ్ (Zee 5) లో

Advertisement

ఈ మరాఠీ మూవీ పేరు ‘సవితా దామోదర్ పరంజ్పే’ (Savita Damodar paranjpe). 2018లో విడుదలైన ఈ మరాఠీ మూవీకి స్వప్న వాగ్మారే జోషి దర్శకత్వం వహించగా, జాన్ అబ్రహం ఈ మూవీని నిర్మించారు. ప్రేమ దక్కలేదని ఒక అమ్మాయి చనిపోయి ఆత్మగా మారుతుంది. ఆ తరువాత ఈ ఆత్మ, భార్య, భర్తలకు తలనొప్పిగా మారుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

శరత్ ఒక ఫేమస్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకొని ఉంటాడు. ఇతనికి కుసుమ్ అనే భార్య ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు. ఏకాంతంగా గడపాలనుకునే లోపు భార్యకి తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. ఆమెకు చాలా రోజులుగా ఈ నొప్పి ఉంటుంది. ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత కుసుమ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండటంతో, అశోక్ అనే డాక్టర్ని ఇంటికే పిలిపించి వైద్యం చేయమంటాడు శరత్. అతడు ఆమె మానసిక ప్రాబ్లంతో ఉండవచ్చనే కోణంలో ట్రీట్మెంట్ చేస్తాడు. అయితే ఆమె లోకి సబితా అనే ఆత్మ ప్రవేశిస్తూ ఉంటుంది. నిజానికి సబిత, శరత్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. కుసుమ మధ్యలో వచ్చి ప్రేమిస్తున్నానంటూ చెప్పి, శరత్ ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళ పెళ్లిని తట్టుకోలేక సబితా ఆత్మహత్య చేసుకుంటుంది.

అయితే ఇప్పుడు కుసుమ, శరత్లను కలవనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అశోక్ కుసుమతో గడపాలనుకుంటుంది ఆత్మ. అలా చేస్తే సబిత ఆత్మ వెళ్ళిపోతుందని ఆమె భర్తతో చెప్తాడు డాక్టర్. వాస్తవానికి అది నిజమే అయినా, తన భార్యపై డాక్టర్ కన్ను వేశాడని గ్రహించి మొదట గట్టిగా కోప్పడతాడు. ఆ తర్వాత అదే నిజమని తెలుసుకుంటాడు కుసుమ భర్త. ఇక చేసేదేం లేక భార్యని ఒక గదిలో పెట్టి, అశోక్ ని లోపలికి పంపిస్తాడు. చివరికి అశోక్ శరత్ భార్యతో ఏకాంతంగా గడుపుతాడా? కుసుమ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందా? కుసుమ మళ్లీ మామూలు మనిషి అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సవితా దామోదర్ పరంజ్పే’ (Savita Damodar paranjpe) అనే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×