E-Paper
Advertisement

‘సేవ్ ద టైగర్స్’ సిరీస్ హిందీ రిలీజ్ పై బజ్… కానీ పెద్ద ట్విస్ట్

‘సేవ్ ద టైగర్స్’ సిరీస్ హిందీ రిలీజ్ పై బజ్… కానీ పెద్ద ట్విస్ట్
Advertisement

Save The Tigers: కుటుంబం అంతా కలిసి చూడదగ్గ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటి ప్యాకేజ్ ఏమన్నా కావాలి అనుకుంటే, అందులోనూ ఇలాంటి జానర్లో ఓటీటీలో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్ అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers). తెలుగు ఓటీటీ స్పేస్‌ లో సరికొత్త సంచలనం సృష్టించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సిరీస్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా విడుదలైన సీజన్ 3 ఊహించని రేంజ్‌లో రికార్డ్ వ్యూస్ సాధించడంతో, మేకర్స్ ఈ సిరీస్‌ ను హిందీలో అడాప్ట్ చేయడానికి సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి హిందీ అడాప్టేషన్ ఎందుకు ? అనే వివరాల్లోకి వెళ్తే…

డైరెక్టర్ క్రేజీ ప్లాన్

పెళ్లయిన ముగ్గురు మొగుళ్ల కష్టాలు, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగో క్లాషెస్, ఫ్యామిలీ డ్రామా అనే యూనివర్సల్ థీమ్‌లు ఏ భాషా ప్రేక్షకులనైనా సులభంగా కనెక్ట్ చేస్తాయి. మూడు సీజన్లుగా ఈ సిరీస్ సక్సెస్ గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా సీజన్ 3లో గాడ్ ఇంద్ర తెచ్చిన మల్టీవర్స్ ట్విస్ట్ ఆడియన్స్‌ కు విపరీతంగా నచ్చేసింది. ఇలాంటి కంటెంట్ హిందీ మార్కెట్‌ లో కూడా బాగా పని చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అందుకే క్రియేటర్ మహి వి రాఘవ్ ఇప్పుడు హిందీ వెర్షన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

యాక్టర్స్ ఛేంజ్

Advertisement

తెలుగులో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ తమ పర్ఫార్మెన్స్‌తో క్యారెక్టర్లను నెక్స్ట్ లెవెల్‌ కు తీసుకెళ్లారు. కానీ హిందీ వెర్షన్‌ లో ఈ ఒరిజినల్ కాస్ట్‌ ను రిపీట్ చేయకుండా, బాలీవుడ్ నేటివిటీకి సరిపోయే సరికొత్త స్టార్ కాస్టింగ్‌ తో వెళ్లాలని మహి వి రాఘవ్ గట్టిగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. నార్త్ ఇండియా కల్చర్, అక్కడి ఫ్యామిలీ లైఫ్‌స్టైల్‌ కు మ్యాచ్ అయ్యేలా స్క్రిప్ట్‌ లో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదివరకులా తెలుగు సిరీస్‌ ను కేవలం డబ్బింగ్ చేయడం కాకుండా, పూర్తి స్థాయిలో హిందీ అడాప్టేషన్‌ గా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

గతంలో మహి వి రాఘవ్ ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి సినిమాలతో పాటు ఓటీటీలో ‘షైతాన్’ లాంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా సక్సెస్ చేశారు. ఇప్పుడు ‘సేవ్ ద టైగర్స్’ హిందీ వెర్షన్‌ తో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ పక్కాగా రెడీ చేస్తున్నారు.అంతా అనుకున్నట్లు జరిగితే, ఒక రీజినల్ వెబ్ సిరీస్ సౌత్ ఇండియా ఓటీటీ స్పేస్ నుంచి బాలీవుడ్ హిందీ మార్కెట్లోకి ఇలా పూర్తి స్థాయిలో క్రాస్ఓవర్ కావడం ఇదే మొదటిసారి అవుతుంది .అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ‘సేవ్ ద టైగర్స్’ హిందీ వెర్షన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది ఆడియన్స్ లో. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Read Also: ఊరు ఊరంతా దొంగలే… పొరపాటున ఫోన్ ఎత్తితే లక్షల్లో డబ్బు మాయం

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×